మూడు సినిమాలు లైన్ లో పెట్టిన మాస్ రాజా

ఎఫ్ 3 కోసం రంగంలోకి రవితేజ !!

మాస్ రాజా రవితేజ పరిస్థితి మరి దారుణంగా మారింది. వరుస పరాజయాల తరువాత ఏడాది గ్యాప్ తీసుకుని రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అందులో రాజా ది గ్రేట్ ఒక్క సినిమా తప్ప ఏ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ మద్యే ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన డిస్కో రాజా గట్టి దెబ్బె కొట్టింది.

దాంతో ఆలోచనలో పడ్డాడు రవితేజ .. అందుకే నెక్స్ట్ సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆయన ప్రసుతం చేస్తున్న క్రాక్ పైనే చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే తన కెరీర్ లోనే బెస్ట్ హిట్స్ గా ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నాడు. బలుపు, డాన్ శీను సినిమా తరువాత హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా క్రాక్.

ప్రస్తుతం క్రాక్ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతుంది. ఈ సినిమా తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యాడు. దాంతో పాటు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు రవితేజ. ఇప్పటికే దానికి సంబందించిన డిస్కషన్స్ జరుగుతున్నాయట. సో త్వరలోనే ఈ రెండు సినిమాల గురించి అనౌన్స్ చేస్తానని చెప్పాడు. మరి ఈ మూడు సినిమాల గురించి ఎప్పుడు ప్రకటిస్తాడా అన్న ఆసక్తి ఇప్పటికి మాస్ రాజా ఫాన్స్ లో నెలకొంది.