Switch to English

రవితేజ వారసుడు మాధవ్ హీరోగా కొత్త సినిమా..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,050FansLike
57,202FollowersFollow

మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం అయింది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో ఈ చిత్రం రూపొందబోతోంది. పెళ్లి సందD చిత్రంతో కమర్షియల్ గా మంచి హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. తాజాగా ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు, నిర్మాత డి సురేష్ బాబు, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారు, దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, నటుడు రఘు తదితరుల ఆశిస్సులతో పూజా కార్యక్రమాలు జరుపుకుని ప్రారంభమైంది. దర్శకులు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ ను అందజేయగా, నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత జె జే ఆర్ రవిచంద్ గారు మాట్లాడుతూ .. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీలో ఈ రోజు ప్రొడక్షన్ నెంబర్ 2 ఓపెనింగ్ జరగడం సంతోషంగా ఉంది. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. ఈ కార్య్రమంలో రాఘవేంద్రరావు గారు స్క్రిప్ట్ అందజేయడం.. ఫస్ట్ షాట్ కు క్లాప్ కొట్టడం.. కెమెరా సురేష్ బాబు గారు స్విచ్ ఆన్ చేశారు. వారికి కృతజ్ఞతలు. పెళ్లి సందD మూవీతోనే ప్రూవ్ చేసుకున్న దర్శకురాలు గౌరి రోణంకి రెండో చిత్రాన్ని మా బ్యానర్ లో చేయడం సంతోషంగా ఉంది. రవితేజ గారి సోదరుడు రఘు గారి అబ్బాయి మాధవ్ ను హీరోగా పరిచయం చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా గౌరి గారి పెళ్లి సందడి ఫ్లేవర్ లో కాకుండా పూర్తి భిన్నంగా ఉంటుంది. మంచి పాయింట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఆమె ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి.. తన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ గారు షూటింగ్ లో బిజీగా ఉండి.. ఈ ఓపెనింగ్ కు రాలేకపోయారు. మంచి ఫ్యామిలీ నుంచి వస్తోన్న మాధవ్ గారు ఈ చిత్రంతో మంచి హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను. గతంలో సాంబశివ క్రియేషన్స్ బ్యానర్ లో ఐదు చిత్రాలు చేశాను. జేజేఆర్ బ్యానర్ లో మొదటి సినిమా నవీన్ చంద్రతో చేశాను. ఇది రెండో సినిమా. ఈ చిత్రంలో అన్ని క్రాఫ్ట్స్ హైలెట్ కాబోతున్నాయి. టెక్నీషియన్స్ అందరూ ఇప్పటికే పెద్ద సినిమాలు చేసి నిరూపించుకుని ఉన్నారు. మొదట్నుంచీ నాకు సపోర్ట్ గా ఉన్న చదలవాడ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు థ్యాంక్యూ సో మచ్..’ అన్నారు.

దర్శకురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ .. ‘నా తల్లి దండ్రులకు, మా గురువు గారు కే రాఘవేంద్రరావు గారికి థ్యాంక్యూ సో మచ్. ఓ రకంగా ఇది నా సెకండ్ డెబ్యూ మూవీగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మమ్మల్ని దీవించడానికి వచ్చిన మా గురువుగారు, సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను.. మా హీరో మాధవ్ ను నమ్మినందుకు నిర్మాత రవిచంద్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. వారు చెప్పినట్టుగా ఇది చాలా యూత్ ఫుల్ గా సాగే కలర్ ఫుల్ గా ఉండే సినిమా. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు ఈ కథ విని చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ చిత్రానికి కూడా మంచి మ్యూజిక్ తో సపోర్ట్ గా నిలుస్తున్నారు అనుకుంటున్నాను. ఇక నా గత చిత్రం లాగానే మీడియా సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను.. ’ అన్నారు.

హీరో మాధవ్ మాట్లాడుతూ.. ‘అందరికీ చాలా థ్యాంక్యూ. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ లో వస్తోన్న రెండో సినిమా ఇది. వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ చిత్రం విడుదలయ్యేంత వరకూ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ఇక్కడి వచ్చిన అందరికీ థ్యాంక్యూ సో మచ్’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Project K: ప్రాజెక్ట్-కె పై రానా ఆసక్తికర వ్యాఖ్యలు..! జోష్ లో...

Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దీపికా పదుకొనే (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachan) నటిస్తున్న ‘ప్రాజెక్ట్ – కె’...

Varun Tej- Lavanya Tripathi: మెగా ఇంట మోగనున్న పెళ్లి బాజాలు?

Varun Tej- Lavanya Tripathi: అందరి అనుమానమే నిజమయ్యేలా కనిపిస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi)...

Tamilnadu: చనిపోయిందనుకొని కన్నతల్లికి అంతక్రియలు.. మర్నాడే ఇంట్లో ప్రత్యక్షం

Tamilnadu: తల్లి చనిపోయిందనుకుని అంత్యక్రియలు చేసాడో కొడుకు. ఆ మరుసటి రోజు ఆమె ఇంటి ఎదురుగా ప్రత్యక్షం అయింది. ఇదేదో సీనియర్ ఎన్టీఆర్ సినిమా 'యమగోల'...

Prabhas-Maruthi: ప్రభాస్‌ – మారుతి సినిమా ‘బాహుబలి’ మాదిరిగా కాదట

చిన్న సినిమాలు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ప్రస్తుతం పవన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు మారుతి చకచక సినిమా...

Allu Aravind: నా వల్ల ఎదిగిన ఆ డైరక్టర్.. నాకే హ్యాండిచ్చాడు:...

Allu Aravind: ఇటివల సూపర్ సక్సెస్ సాధించిన 2018 సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 'నా వల్ల...

రాజకీయం

YS Jagan: జగనన్నా.! జనం గేట్లు దూకి ఎందుకు పారిపోతున్నారన్నా.?

YS Jagan: పదుల సంఖ్యలో కరడుగట్టిన కార్యకర్తలు.. వందల సంఖ్యలో సాధారణ కార్యకర్తలు.. వీరికి అదనంగా, డబ్బులు ఖర్చు చేసి రప్పించుకున్న జనాలు.! ఇదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ...

Kesineni Nani: ఎంపీ కేశినేని నాని టీడీపీలో వున్నట్టా.? లేనట్టా.?

Kesineni Nani: కేశినేని నాని.. ఒకప్పుడు కేశినేని టూర్స్ అండ్ ట్రావెల్స్‌తో వార్తల్లో వ్యక్తిగా వుండేవారు. టీడీపీ ఎంపీ అయ్యాక, కేశినేని నాని పొలిటికల్ హంగామా వేరే లెవల్‌కి చేరింది. ఏ పార్టీలో...

Vijay Sai Reddy: విజయసాయిరెడ్డి ఈజ్ బ్యాక్.! కండిషన్స్ అప్లయ్.!

Vijay Sai Reddy: ఎట్టకేలకు విజయసాయిరెడ్డి మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. వైసీపీ కీలక నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి గత కొంతకాలంగా ట్విట్టర్ వేదికగా ‘రాజకీయ ప్రత్యర్థులపై’ పంచ్ డైలాగులు పేల్చడం...

జగన్ పరిపాలన గురించి ఇప్పుడు మాట్లాడు అంటున్న మాజీ సీఎం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచి పోయే విధంగా అరుదైన ఘనత సొంతం చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బిజెపిలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. మరో...

YS Avinash Reddy: అవినాశ్ రెడ్డికి బెయిలొచ్చింది.! ఓ పనైపోయింది.!

ఔను, అవినాశ్ రెడ్డికి బెయిలొచ్చింది.! ఔను, ఓ పనైపోయింది.! ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు.. అంటూ మీడియాలో రచ్చ ఇకపై వుండదు.! కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద...

ఎక్కువ చదివినవి

Bro: ‘బ్రో’ సినిమాలో ‘గుడుంబా శంకర్’ మాస్ సాంగ్?

Bro: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pavan Kalyan) కి ఫోక్ సాంగ్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఆయన సినిమాల్లో ఐటెం సాంగ్స్ రూపంలో ఇలాంటి పాటలు తరచుగా కనిపిస్తుంటాయి. అంతేకాకుండా...

కూతురు పుట్టిన సంతోషం.. ఏనుగుపై ఊరేగింపు

ఈ కాలంలో కూడా చాలా మంది అమ్మాయి పుట్టిందని బాధ పడే వారు ఉన్నారు... గర్భంలోనే చిదిమేసే వారు కూడా ఉన్నారు. వారందరికి కూడా చెంప పెట్టు అన్నట్లుగా మహారాష్ట్రకు చెందిన గిరీష్...

Baharla Ha Madhumas: రీల్స్, యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో ఆ పాట..

Baharla Ha Madhumas: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎప్పుడేది ట్రెండ్ అవుతుందో తెలీదు. కానీ.. సరైన సినిమా పాటలు, సిగ్నేచర్ స్టెప్స్, డైలాగ్స్ ఉంటే మాత్రం ఆకాశమే హద్దుగా వైరల్ అయిపోతుంది....

Chiranjeevi: ‘ఆగయా.. భోళాశంకర్’ చిరంజీవి కిర్రాక్ స్టిల్ తో కీలక అప్డేట్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) కొత్త సినిమా వస్తుందంటే మెగాభిమానుల్లో ఉత్సాహం అనే డ్యామ్ కి గేట్లు ఎత్తినట్టే. దశాబ్దాలుగా చిరంజీవి (Chiranjeevi) సృష్టించుకున్న కంచుకోట అది. కొత్త అప్డేట్...

Chinmayi: ‘అతనిపై చర్యలు తీసుకోండి’ సీఎంకు గాయని చిన్మయి విన్నపం

Chinmayi: ‘స్టాలిన్ సార్.. (CM Stalin) తమిళ సినీ గేయ రచయిత వైరముత్తు (Vairamuthu) పై చర్యలు తీసుకోండి. మమ్మల్ని లైంగికంగా వేధించాడని 17 మంది వెల్లడించడంతో మా కెరీర్ నాశనం చేశాడు....