Allu Arjun: పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయ్యారు అల్లు అర్జున్-రష్మిక. ప్రస్తుతం వీరిద్దరూ సీక్వెల్ పుష్ప-2లో అలరించేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 5న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే.. ప్రస్తుతం వీరిద్దరూ ఒకరికొకరు విష్ చేసుకున్న సందర్భం వైరల్ అవుతోంది. రష్మిక తనకు దీపావళి కానుక పంపించినట్టు అల్లు అర్జున్ చెప్పారు.
‘వెండి వస్తువు మీకు కానుకగా పంపిస్తున్నాను. వెండి కానుక అందుకునే వ్యక్తికి అదృష్టం వరిస్తుందని మా అమ్మ చెప్పింది. మీకు మరింత లక్, పాజిటివిటీ దక్కాలని కోరుకుంటున్నా’నంటూ రష్మిక కానుకతోపాటు నోట్ పంపించారు. దీనిపై అర్జున్ స్పందిస్తూ.. ‘థ్యాంక్యూ మై డియర్.. ఇప్పుడు మరెంతో లక్ కావా’లంటూ రిప్లై ఇచ్చారు.
రష్మిక స్పందిస్తూ.. ‘బాక్సాఫీస్ వద్ద మన పుష్ప రూల్ చేస్తుంది. మన శ్రమకు ప్రేక్షకుల నుంచి తగిన గుర్తింపు వస్తుం’దంటూ రష్మిక రిప్లై ఇచ్చారు. వీరి సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
Thanks ffor every other informative site.
Thee plkace else maay jst I amm gettijng thqt ind oof info written iin uch a
perfrct approach? I have a undertaking thatt I am simpoy
noow worjing on, andd I have beesn on thee look outt forr sch information.