Rashmika: టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ రేసులో ముందుంటుంది రష్మిక మందన (Rashmika Mandana). చలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. గీత గోవిందం వంటి సూపర్ హిట్ తో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. పుష్ప, యానిమల్ సినిమాలతో తన సక్సెస్ గ్రాఫ్ ని మరింత పెంచుకుంది. ఇప్పుడు మరో అరుదైన ఘనతను సాంతం చేసుకుంది. వివిధ రంగాల్లో ప్రతిభ చూపే వారికి ఏటా ప్రకటించే ఫోర్బ్స్ ఇండియా ‘30 అండర్ 30’ జాబితాలో స్థానం దక్కించుకుంది.
ప్రస్తుతం పుష్ప-2తో నటిస్తున్న రష్మిక తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని తెలుపుతూ తన సంతోషాన్ని పంచుకుంది. అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 30ఏళ్ల వయసులోపు ఉన్న 30 మంది ప్రతిభావంతుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. వినోదం, క్రీడలు, సంగీతం, చారిటీ, ఆర్ధిక, మీడియా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫ్యాషన్, ఇంధనం, స్టార్టప్స్.. వంటి వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతున్న వారికి ఈ జాబితాలో చేర్చుతారు.