దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొంది తాజాగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుని హిట్ టాక్ ను దక్కించుకుంది. ఈ చిత్రంలో అఫ్రిన్ గా కనిపించిన రష్మిక పాత్రకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమా సక్సెస్ నేపథ్యంలో రష్మిక మీడియాతో మాట్లాడింది.
అఫ్రిన్ పాత్రకు రెస్పాన్స్…
‘సీతారామం’ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. కష్టానికి తగ్గ ఫలితం ప్రేక్షకులు క్లాసిక్ బ్లాక్ బస్టర్ రూపంలో ఇచ్చారు. దర్శకుడు హను గారు అఫ్రిన్ పాత్రని గురించి చెప్పినపుడు ఆ పాత్రలో గ్రేట్ ఆర్క్ వుందని అన్నారు. నేను కూడా దాన్ని బలంగా నమ్మాను. ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ కు చాలా సంతోషంగా ఉంది.
అఫ్రిన్ పాత్ర సవాల్…
అఫ్రిన్ లాంటి వైలెంట్ పాత్ర ఇంత వరకూ చేయలేదు. ఇది ఛాలెంజ్ గా అనిపించింది.
సీతారామం కథ మొదట విన్నప్పుడు…
నేను ఇప్పటి వరకూ హీరోయిన్ గానే చేశాను. అయితే ఒక నటిగా విభిన్నమైన పాత్రలు చేయాలని వుంటుంది. కథ మొదట విన్నప్పుడే సీతారామం లో నా పాత్ర చాలా యునిక్ గా అనిపించింది. ఒక గొప్ప కథని చెప్పే పాత్ర కావడం నాకు చాలా నచ్చింది. రాబోతున్న సినిమాల్లో కూడా కొన్ని డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా.
ఇప్పుడు ప్రయోగాత్మక చిత్రాలు రిస్క్….
కంఫర్ట్ జోన్ లో వుండటం బాగానే వుంటుంది. అయితే ఒక నటిగా అన్ని డిఫరెంట్ పాత్రలు చేయాలని వుంది. ఇప్పుడు నా కంఫర్ట్ జోన్ దాటి కొన్ని సినిమాలు చేస్తున్నా.
హను రాఘవపుడి గారితో పని చేయడం…
హను గారు గ్రేట్ ప్యాషన్ వున్న దర్శకుడు. సినిమా కోసం చాలా కష్టపడతారాయన. ఆయన పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. చాలా ఆనందంగా వుంది.
డ్రీమ్ రోల్స్..
పిరియాడికల్ మూవీ చేయాలనీ వుంది. అలాగే స్పోర్ట్స్, యాక్షన్, బయోపిక్.. ఇలా డిఫరెంట్ మూవీస్ చేయాలనీ వుంటుంది.
హిందీలో బ్యాక్ టు బ్యాక్…
హిందీలోనే కాదు .. తెలుగు లోనూ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. ఛలో షూటింగ్ లోనే వుండగా గీతగోవిందం, దేవదాస్ చిత్రాల అవకాశాలు వచ్చాయి. సరైన కథలు వస్తున్నపుడు అలా జరిగిపోతాయి. అదృష్టంతో పాటు హార్డ్ వర్క్ ని నమ్ముతాను.
247371 36026Woh I like your articles , saved to fav! . 349404