వరుస సినిమాల హిట్లతో దూసుకుపోతోంది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. ఆమె నటించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ “ఛావా”. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు థియేటర్లలో విడుదలై హిట్ టాక్ సొంతం తెచ్చుకుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన సినీ కెరీర్ పై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమాల ఎంపికలో కథనే ప్రామాణికంగా తీసుకుంటానని చెప్పారు.
” నేను చేయగలనన్న నమ్మకంతోనే దర్శక నిర్మాతలు నన్ను సంప్రదిస్తారు. కానీ నేను కథకు ప్రాధాన్యం ఇస్తా. స్క్రిప్ట్ నచ్చితే నలుగురు పిల్లల తల్లి పాత్ర అయినా, బామ్మ పాత్ర అయినా ఓకే అంటాను. ఆ ప్రాజెక్టులో నేను భాగం కావాలనుకున్నప్పుడు కథను తప్ప ఇంకేం పట్టించుకోను. ఇక నా సినిమాల విషయానికొస్తే.. నాకు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు ఉండవు. సినిమాల విజయాలు మన చేతిలో ఉండవు. ప్రేక్షకులకు నచ్చితేనే వాటిని ఆదరిస్తారు. ఈ మధ్య సినిమాలతో పాటు నటీనటుల అభినయాన్ని కూడా ప్రేక్షకులు గమనిస్తున్నారు. అదృష్టవశాత్తు నా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అందుకు అభిమానులకు నేను రుణపడి ఉంటాను” అని రష్మిక అన్నారు.
“పుష్ప -2” తో భారీ హిట్ అందుకున్న రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో “సికందర్” మూవీ చేస్తున్నారు. దీంతోపాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న “కుబేర” తో పాటు రాహుల్ రవీంద్ర దర్శకుడిగా “ది గర్ల్ ఫ్రెండ్” స ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.