Rashmika: నిన్న జరిగిన ‘పుష్ప 2 ది రూల్’ థాంక్యూ మీట్ లో పాల్గొనలేకపోయిన రష్మిక టీమ్ ను ఉద్దేశించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. పుష్ప సినిమాతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించానని చెప్పుకొచ్చారు. ఇందుకు ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు. చిత్ర బృందానికి కృతజ్ఞతలు చెప్పారు.
‘పుష్ప 2 థాంక్స్ మీట్ లో పాల్గొనలేకపోయా. ఇందుకు బాధగా ఉన్నా.. కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. పుష్ప సినిమా ప్రాజెక్టులో నన్ను భాగం చేసినందుకు అల్లు అర్జున్, మైత్రీ మూవీస్, సుకుమార్ సర్ కు థాంక్స్. ఒక మాస్టర్ పీస్ మూవీకి ఇంతటి విజయం దక్కించినందుకు ప్రేక్షకులకు థాంక్స్. శ్రీవల్లిగా చెప్తున్నా.. మీ అందరికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది’.
‘సినిమా అద్భుతంగా రావడంలో టీమ్ మొత్తం ఎంతో శ్రమించింది. అన్ని విభాగాల్లో అందరూ కష్టపడి పని చేశారు. ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతమైన పాత్ర నాకు ఇచ్చినందుకు టీమ్ మొత్తానికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’నని రష్మిక అన్నారు.