Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన చేసిన పోస్ట్ ఆమె అభిమానులను కలవరపాటుకు గురి చేసింది. కాలికి గాయమై.. కట్టుతో ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఎప్పటికి తగ్గుతుందో కూడా తెలీదని ఆమె అన్నారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఎంతో ఇష్టంగా చూసే జిమ్ లో వర్కౌట్లు చేస్తూ గాయపడ్డాను. త్వరగా కోలుకుని సినిమా షూటింగ్స్ లో పాల్గొనాలని చూస్తున్నా. ఎప్పటికి కోలుకుంటానో భగవంతుడే నిర్ణయించాలి. నాకోసం సికిందర్, థామ, కుబేర సెట్స్ ఎదురు చూస్తున్నాయి. ఈ సినిమాల దర్శకులు నన్ను క్షమించాలి. గాయం ఏమాత్రం తగ్గినా షూటింగుల్లో పాల్గొంటా’నని రాసుకొచ్చారు.
ప్రస్తుతం రష్మికకు నేషనల్ ఫాలోయింగ్ ఉంది. పుష్ప 2తో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఆమె విక్కీ కౌశల్ కు జంటగా నటించిన ఛావా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. చారిత్రాత్మిక కథాంశంతో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీపై అంచనాలు నెలకొన్నాయి.