ప్రకృతి సృష్టించిన బీభత్సానికి కేరళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వయనాడ్ లో భారీ వర్షాలు, వరదల కారణంగా కొండ చరియలు విరిగిపడి 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది క్షతగాత్రులు అయ్యారు వేలాదిమంది సర్వం పోగొట్టుకున్నారు.అక్కడి బాధితులకు సాయం చేయడం కోసం రాజకీయ, సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా హీరోయిన్ రష్మిక కూడా తన వంతు సాయం చేశారు. తరచుగా సోషల్ ఇష్యూస్ పై స్పందించే రష్మిక మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. వయనాడ్ విషాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేందుకు కేరళ సీఎం సంక్షేమ నిధి కి రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. కష్ట సమయంలో కేరళ ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు.
సినిమాల విషయానికొస్తే ఆమె పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆమె చేతిలో ప్రస్తుతం ఆరు సినిమాలు ఉన్నాయి. ఆమె అల్లు అర్జున్ తో జంటగా నటించిన “పుష్ప – 2” ఈనెల 15న విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల డిసెంబర్ కు వాయిదా పడింది.