Rashmika: విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కింగ్ డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ రివీల్ చేయడంతోపాటు టీజర్ కూడా లాంచ్ చేసింది చిత్ర యూనిట్. ‘కింగ్ డమ్’ టీజర్ ఆయన అభిమానులను అలరిస్తోంది. ఈక్రమంలో టీజర్ విడుదలైన నిముషాల్లోనే నటి రష్మిక స్పందించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
‘ఈ వ్యక్తి ప్రతిసారీ ఏదొక అద్భుతంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతాడు. కింగ్ డమ్ టీజర్ నాకెంతో నచ్చింది. ఒకే తరహా కథలు కాకుండా డిఫరెంట్ జోనర్స్ కథలు ఎంచుకోవడం నాకు నచ్చుతుంద’ని ఇన్ స్టా వేదికగా ఆమె పోస్ట్ చేశారు. ప్రస్తుతం రష్మిక పోస్ట్ అటు ఆమె అభిమానుల్ని, ఇటు విజయ్ అభిమానుల్ని సంతోషంలో ముంచెత్తింది.
‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతూంటాయి. పలు సందర్భాల్లో వీరిరువురూ కలిసి కనిపించడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలో ‘కింగ్ డమ్’పై ఆమె చేసిన పోస్ట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.