చట్టాలు ఎన్నొచ్చినా.. ఎన్ని రకాల శిక్షలు ప్రవేశ పెట్టినా.. ప్రభుత్వం ఎన్ని రకాలుగా మహిళా సంరక్షణ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినా ఎక్కడో ఒకచోట.. ఏదో ఒకరంగా వాళ్లని హింసిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మైనర్ బాలికల మీద పెరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం సీరియస్ యాక్షన్ లోకి దిగుతున్నాయి. అయినా సరే ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా కృష్ణా జిల్లాలో ఇలాంటి దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికపై 4 రోజులు నిర్భంధించి అత్యాచారం చేశారు ఒక గ్యాంగ్. కేసుని సీరియస్ గా తీసుకున్న ఎస్పీ గంగాధర్ విచారణ నిర్వహిస్తున్నారు.
ఈ నెల 13న కొండూరుకికి చెందిన ఒక మైనర్ బాలిక ఇంట్లో గొడవలకు కారణం తనే అనే కుటుంబ సభ్యులు కోప్పడటంతో ఆమె మనస్తాపంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే టైం లో వీరపనేని గూడెంలో అప్పటికే మద్యం సేవించి ఉన్న రజాకర్ అనే వ్యక్తి బాలికకు మాయ మాటలతో ఇంటికి తీసుకెళ్తానని చెప్పి బైక్ పై ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అతని స్నేహితులు అనిల్, జితేంద్ర దగ్గరకు ఆమెకు తీసుకెళ్లాడు.. వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వాళ్లు ఆమెను కేసరపల్లికి చెందిన అనిత్, హర్షవర్ధన్ దగ్గరకు తీసుకెళ్తే అక్కడ కూడా ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. దాదాపు 4 రోజులుగా ఇలా ఆమెను అత్యాచారం చేశారు. మార్చి 17న ఆమెను విజయవాడలో వదిలేసి వెళ్లిపోయారు.
ఆ టైంలో ఒక ఆటో డ్రైవర్ ఆమెను గమనించి ఆరా తీయడంతో విషయం అతనికి వెల్లడించింది. అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ మైనర్ బాలిక అప్పటికే నీరసించి పోవడంతో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
అమ్మాయి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు ఆత్కూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. విషయం తెలుసుకుని బాలిక తల్లిదండ్రులు పోలీసుల ద్వారా హాస్పిటల్ కు చేరుకున్నారు. ఐతే ఈ కేసు విషయంలో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొదరు పరారీలో ఉండగా వారి కోసం వెతుకుతున్నారు. బాలిక చెప్పిన వివరాల ప్రకారం ఏడుగురు తనపై పలుమార్లు అత్యాచారం చేశారని పోలీసులు గుర్తించారు. ఈ కేసు విషయంలో పోలీసులు చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు.