Switch to English

జనసేనకి రాపాక వెన్నుపోటు.. ‘డే వన్‌’ నుంచే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌. పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌, తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా, రాపాక వరప్రసాద్‌ మాత్రం అనూహ్యంగా గెలిచారు. ‘మా పార్టీ నుంచి గెలిచింది ఒక్కరే అయినా.. అసెంబ్లీలో అధికార పక్షానికి మా సత్తా ఏంటో చూపిస్తాం..’ అని జనసైనికులు బోల్డంత ఆత్మవిశ్వాసంతో కన్పించేవారు. కానీ, ఏం లాభం.? క్రమక్రమంగా రాపాక వరప్రసాద్‌, వైఎస్సార్సీపీకి దగ్గరపోయారు. ‘పార్టీలో నాకు సరైన ప్రాధాన్యత దక్కడంలేదు..’ అని పదే పదే రాపాక ‘అసహనం’ వ్యక్తం చేయడం.. చివరికి, ఆయన పూర్తిగా వైఎస్సార్సీపీ వైపు వెళ్ళిపోవడం చకచకా జరిగిపోయాయి.

నిజానికి, రాపాకపై అధికార పార్టీ అడ్డగోలు కేసులతో వేధింపులకు పాల్పడినప్పుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు.. రాపాకకు మద్దతుగా తాను స్వయంగా రంగంలోకి దిగుతానని చెప్పారు. ఓ దశలో రాపాక, జగన్‌ని కాదని జనసేనలోనే కొనసాగుతున్నట్లు ప్రచారం జరిగినా, తెరవెనుక ఆయన ఆలోచనలు వేరేలా పనిచేశాయి.

తాజాగా, రాపాకకు సంబంధించి ఓ వీడియో వెలుగు చూసింది. కొన్ని కారణాలతో వైసీపీ నుంచి అవకాశం దక్కించుకోలేకపోయాననీ, అందుకే జనసేనలో చేరాననీ, జనసేన నుంచి గెలిచిన వెంటనే వైఎస్‌ జగన్‌ని కలిశాననీ, ‘కలిసి పనిచేద్దాం’ అని జగన్‌ చెప్పారనీ, అప్పటి నుంచీ వైసీపీ నేతగానే చెలామణీ అవుతున్నాననీ ఆ వీడియోలో రాపాక చెప్పుకొచ్చారు. రాపాక చెప్పిందే నిజమైతే, ‘నమ్మక ద్రోహం’, ‘వెన్నుపోటు’ అనేవి చాలా చిన్న మాటలని జనసైనికులు తీవ్రస్థాయిలో రాపాకపై సోషల్‌ మీడియా వేదికగా ధ్వజమెత్తుతున్నారు.

‘నేను జనసేన ఎమ్మెల్యేనే.. పవన్‌ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరాను..’ అని మొదట్లో చెప్పిన రాపాక, జనసేనాని మెప్పు కోసం జగన్‌ మీద విమర్శలు చేసిన రాపాక.. ఇప్పుడిలా ప్లేటు ఫిరాయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ‘ఆయన (పవన్‌ కళ్యాణ్‌) రెండు చోట్ల ఓడిపోవడానికి కారణం మిగతా కులాలు ఆయన్ని పట్టించుకోకపోవడమే. అది నిలబడే పార్టీ కాదు..’ అని చెప్పిన రాపాకే, ‘నేను గెలవడానికి ఆ సామాజిక వర్గం (కాపు సామాజిక వర్గం) బాగా కలిసొచ్చింది..’ అని చెప్పడం గమనార్హం.

డే వన్‌ నుంచే రాపాక, వైసీపీ మనిషి అని జనసేన పార్టీకి స్పష్టత వుంది గనుకనే.. పార్టీ ఆయన విషయంలో ఒకింత జాగ్రత్తగా వుంటూ వచ్చింది. ఇప్పటికీ, జనసేన పార్టీ తరఫున రాపాకపై గట్టిగా విమర్శలు ఎవరూ చేసింది లేదు. ఇప్పుడు కూడా, ‘రాపాకపై ఎవరూ విమర్శలు చేయొద్దు.. పార్టీ అధినేత స్పందించేవరకూ సంయమనం పాటించాలి..’ అని జనసేన నేతలు, జనసైనికులకు సూచిస్తున్నారు. కానీ, రాపాక వెన్నుపోటు వ్యవహారం వెలుగు చూడ్డంతో, కొంతమంది జనసైనికులు కాస్త ఘాటుగానే రాపాకపై విరుచుకుపడుతున్నారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...