Switch to English

‘ఇది బ్రహ్మానందం నట విశ్వరూపం: ప్రకాశ్ రాజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగమార్తాండ’ ఉగాది కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఈ చిత్ర నటులు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అనసూయ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చిత్ర షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు.

‘ప్రకాష్ రాజ్ విశ్వరూపాన్ని చూడొచ్చు’

ఈ చిత్రం గురించి బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్ ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఈ సినిమాలో ఓ పాత్రను చేయాల్సిందిగా నాకు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. షూటింగ్ మొదలై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత ఓ రోజు ప్రకాష్ రాజ్ ఫోన్ చేసి ‘ ఈరోజు మీరు నటించిన సీన్ అద్భుతంగా ఉంది చాలా గొప్పగా నటించారు’ అంటూ మెచ్చుకున్నారు. నిజానికి ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి ఈ విషయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వ్యక్తిత్వానికి అదో నిదర్శనం. ఆయన తెలుగు వ్యక్తి కాకపోయినప్పటికీ తెలుగు భాష పై చాలా పట్టుంది. డైలాగ్ లు అన్ని ఎప్పటికప్పుడు అద్భుతంగా చెప్పేవారు. ఇందులో కొన్ని సన్నివేశాలు సింగిల్ టేక్ లో పూర్తి చేశాను. వాటి చిత్రీకరణ సమయంలో ప్రకాష్ రాజ్ పక్కనే ఉండి గమనించేవారు. ‘ఇంకో టేక్ చేయమని చెప్పావంటే చంపేస్తాను’ అంటూ కృష్ణవంశీని హెచ్చరించేవారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విశ్వరూపం చూడొచ్చు. మిగిలిన వారు కూడా అంతే అద్భుతంగా నటించారు’ అని తెలిపారు.

ఆయన్ను ‘డాడీ’ అని పిలుస్తా..

ఈ సినిమా గురించి దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం ప్రకాష్ రాజ్. ‘ నట సామ్రాట్’ చిత్రాన్ని చూడమని చెప్పింది ఆయనే. తర్వాత ఆ చిత్రం రైట్స్ తీసుకుని నా దగ్గరకు వచ్చారు. ఈ సినిమా నువ్వే డైరెక్ట్ చేయాలని నాతో అన్నారు. ఆయన మీద నమ్మకంతో సినిమాను మొదలు పెట్టాను. అలాంటి నటుడిని ‘నువ్వు చెత్త నటుడివి’ అంటూ చెంప దెబ్బ కొట్టే పాత్ర ఒకటి కావాలి అనుకున్నప్పుడు మాకు బ్రహ్మానందం గారు గుర్తొచ్చారు. ఆయనకి నటనతో పాటు తెలుగు భాష మీద మంచి పట్టు ఉంది. ఆయన నేను ‘డాడీ’ అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తుంటాను. వేలాది సినిమాలు చేసిన ఆయన గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’ అని అన్నారు.

‘ఇది అందరి సినిమా’

ఈ చిత్రాన్ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘ డైరెక్టర్ కృష్ణ వంశీతో నాది ఎన్నో ఏళ్ల ప్రయాణం. మా ఇద్దరి కాంబినేషన్లో ‘అంతఃపురం’, ‘ఖడ్గం’, ‘గోవిందుడు అందరివాడే’ వంటి సినిమాలు వచ్చాయి. ‘నటసామ్రాట్’ చూసిన తర్వాత ఒక కళాకారుడు జీవితంలో ఉన్న బరువు గురించి నాకు అర్థమైంది. ఇలాంటి కథను ప్రేక్షకులకు చూపించాలని అనుకున్నాను. ఒక నటుడు రిటైర్మెంట్ తర్వాత ఎన్నో కష్టాలతో బతకాల్సి వస్తుంది. అది చాలా విషాదం. ఈ సినిమాలో నాకు ఒక జీవితం కనిపించింది. అలాగే ఈ సినిమాలో నేను కూడా భాగం కావాలనుకున్నాను. ఇదే విషయాన్ని కృష్ణవంశీకి చెప్పగానే దర్శకత్వం వహించడానికి ఒప్పుకున్నారు. ఆయనకే ఎందుకు చెప్పానంటే అతడు మాత్రమే ఎమోషన్స్ ను చక్కగా జనాలకి చూపించగలరు. ఇక బ్రహ్మానందం కూడా ఈ సినిమాలో భాగం కావాలని అనుకున్నప్పుడు నేను ఇంకేం ఆలోచించలేదు. ఆయనతో కలిసి నటించిన తర్వాత ఆయనలో విశ్వరూపాన్ని చూశాను. చాలా రోజుల తర్వాత ఆ మ్యాజిక్ చూసే భాగ్యం నాకు దొరికింది. అలాగే ఈ సినిమాలో నటీనటులు అందరూ కూడా చాలా అద్భుతంగా నటించారు. ప్రతి ఒక్క టెక్నీషియన్ తో కృష్ణవంశీ అద్భుతంగా పనిచేయించారు. ఇది అందరికీ నచ్చే సినిమా. అందరికీ కావాల్సిన సినిమా. ఇలాంటివి మరెన్నో రావాలి’ అని చెప్పారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...