మెగా హీరో వైష్ణవ్ తేజ్ నుండి వచ్చిన తాజా చిత్రం రంగ రంగ వైభవంగా. రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. సందీప్ రెడ్డి దగ్గర పనిచేసిన గిరీశాయ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.
కథ:
చిన్నతనం నుండే క్లాస్ మేట్స్, పక్కింటి వాళ్ళు అయిన రిషి (వైష్ణవ్ తేజ్), రాధా (కేతిక శర్మ) ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. వాళ్లతో పాటు వాళ్ళ ఇగోలు కూడా పెరిగి పెద్దయ్యి, కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా చేస్తాయి. అలా అని ఒకరంటే ఒకరికి ఇష్టముండదు అని కాదు.
అయితే కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఈ రెండు కుటుంబాల మధ్య అగాథం ఏర్పడుతుంది. దానికి దారితీసిన పరిణామాలు ఏంటి? రిషి, రాధాల ప్రేమకథ ఏ తీరానికి చేరింది? వంటి ప్రశ్నలకు సమాధానాలు థియేటర్లోనే లభిస్తాయి.
నటీనటులు:
వైష్ణవ్ తేజ్ లో సినిమా సినిమాకూ కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. ఈ చిత్రంలో బాగానే నటించాడు. అయితే ఎమోషనల్ సీన్స్ లో తేలిపోతున్నాడు. అది కొంచెం చూసుకోవాలి. అలాగే డ్యాన్స్ లపై కూడా శ్రద్ధ పెట్టాలి. రొమాంటిక్ మూవీ లో లస్టీగా కనిపించిన కేతిక శర్మ ఈ చిత్రంలో పూర్తిగా డిఫెరెంట్ గా కనిపించింది. ఆమె చూడటానికి బాగుంది. పెర్ఫార్మన్స్ కూడా పర్వాలేదు.
నవీన్ చంద్ర ఉన్న అందరిలో ప్రముఖంగా గుర్తుంటాడు. అయితే తన పాత్ర ఏమాత్రం సవ్యంగా సాగదు. ఇక దీన్ని బట్టి మిగతా పాత్రల తీరుతెన్నులను అర్ధం చేసుకోవచ్చు. నరేష్, ప్రభు అంటూ ప్యాడింగ్ భారీగానే ఉంది. అయితే ఫస్ట్ హాఫ్ లో అలీ కామెడీ, సెకండ్ హాఫ్ లో సత్య కామెడీ కొంత రిలీఫ్ ను ఇస్తాయి. మిగతా వారు మాములే.
సాంకేతిక వర్గం:
దేవి శ్రీ ప్రసాద్ పాటలు బాగానే సాగాయి. మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ కాదు కానీ వినడానికి బాగానే అనిపిస్తాయి. తీయడం కూడా ఇంప్రెస్ చేస్తుంది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రొటీన్ గానే సాగింది. పెద్దగా చెప్పుకోవడానికి లేదు. శాందత్ అందించిన సినిమాటోగ్రఫీ కలర్ఫుల్ గా సాగింది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. నిర్మాణవిలువలకు ఢోకా లేదు.
గిరీశాయ ఒక అరగదీసి పాయింట్ ను తీసుకుని దానికి ఫ్రెష్ ట్రీట్మెంట్ ఇద్దామని ప్రయత్నించాడు కానీ దాంట్లో సగమే సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు కానీ సెకండ్ హాఫ్ ను భరించడం కష్టమే.
పాజిటివ్ పాయింట్స్:
- లీడ్ పెయిర్
- పాటలు
- ఫస్ట్ హాఫ్
నెగటివ్ పాయింట్స్:
- రొటీన్ స్టోరీ
- రైటింగ్
- బలమైన ఎమోషన్స్ లేకపోవడం
చివరిగా:
రంగ రంగ వైభవంగా రొటీన్ గా సాగే ఫామిలీ డ్రామా. కుటుంబంతో కలిసి చూడొచ్చు. అయితే కథాకథనాల విషయంలో అసంతృప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. అంచనాలను అదుపులో ఉంచుకుని వెళ్తే నచ్చే అవకాశాలున్నాయి.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5