స్టార్స్ తో అభిమానులు సెల్ఫీలు తీసుకోవడం సాధారణ విషయం. ఇలానే తన అభిమాన హీరో రణబీర్ కపూర్ తో సెల్ఫీ తీసుకోబోయాడు ఓ అభిమాని. అయితే.. అతని ఫోన్ అడిగి తీసుకున్న రణబీర్ దానిని విసిరేసిన ఘటన వైరల్ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఓ యువకుడు రణబీర్ తో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించాడు. మొదట రణబీర్ ఇష్టంగానే సెల్ఫీ దిగాడు. అయితే.. ఆ యువకుడు రెండోసారి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా రణబీర్ కు కోపం వచ్చి ఆ ఫోన్ లాక్కుని విసిరేసాడు. దీనిని చిత్రీకరించిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అయితే.. ఇలా ఎందుకు జరిగిందనే దానిపై భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
కొందరు ఇది ఏదైనా యాడ్ కావొచ్చని.. రణబీర్ కు కోపం తెప్పించాడని.. రణబీర్ సరదాగా చేసాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇటివల సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి రోజున హీరో బాలకృష్ణ ఇలానే ఓ అభిమాని ఫోన్ విసిరేయడంతో.. రణబీర్ కాపీ కొట్టాడనే కామెంట్లూ వస్తున్నాయి.
Shocking 😱 Ranbir Kapoor THROWS Fan's Phone for annoying him for a Selfie.#RanbirKapoor pic.twitter.com/dPEymejxRv
— [email protected] (@SAMTHEBESTEST_) January 27, 2023