Bahubali: దర్శకధీరుడు రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ వేదికగా ‘మోడ్రన్ మాస్టర్స్: రాజమౌళి’ డాక్యుమెంటరీ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాహుబలి గురించి ఇప్పటివరకూ ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. బాహుబలిగా ప్రభాస్ కు ధీటైన భళ్లాలదేవుడి పాత్రలో నటించిన రానా ఎంతగా ఒదిగిపోయారో చూశాం. అయితే.. ఈ పాత్రకి మొదటగా వేరే నటుడిని అనుకున్నట్టుగా వెల్లడించారు.
ఆక్వామెన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ‘జేసన్ మమోవా’ను మొదటగా అనుకున్నారు. కథలో ప్రభాస్ కు ధీటుగా ఉండే కటౌట్ కావాలని అతడి పేరు ప్రస్తావించారు. అయితే.. ఓరోజు ప్రభాస్ ను కలిసి నిర్మాత శోభు యార్లగడ్డ సినిమా, విలన్ పాత్ర ప్రస్తావన తీసుకొచ్చారు. వేరెవరిని ముందు ఎంచుకున్నారని రానా అడిగారు.
దీనికి జేసన్ మమోవా పేరును వెల్లడించారు శోభు. ఆపై నవ్వుకుని భళ్లాళదేవుడి పాత్రకు ఓకే చెప్పారట రానా. ఆపై బాహుబలి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో తెలిసిన విషయమే.
Hi, Neat post. There’s an issue together with your website in web
explorer, might check this? IE nonetheless is the marketplace leader and a huge element of other folks will omit your fantastic writing due
to this problem.