కొన్ని సార్లు అనుకోకుండా చేసే కామెంట్లు కూడా వినేవారికి ఇంకో రకంగా అర్థం అవుతాయి. దాంతో గొడవలు జరుగుతాయి. ఇప్పుడు ఐఫా అవార్డు వేడుకల్లో తేజ సజ్జా, రానా చేసిన కామెంట్లు కూడా కొంత మంది హీరోలు, దర్శకులకు కోపం తెప్పిస్తున్నాయి. అయితే వారు కావాలని చేయకపోయినా.. ఏదో ఫన్ క్రియేట్ చేయడం కోసం చేసిన కామెంట్లు ఇలా అవుతున్నాయన్నమాట. అయితే మహేశ్ బాబు మీద రానా, తేజ చేసిన కామెంట్లపై ఆయన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే వారు నిజంగా మహేశ్ ను అనాలని అనలేదు.
మహేశ్ బాబును పొగిడే ఉద్దేశంలో రానా కొన్ని కామెంట్లు చేస్తే.. అవి నాకు కూడా సూట్ అయ్యేలా ఉన్నాయన్నాడు తేజసజ్జా. పైగా సంక్రాంతి పోరును రానా వివరిస్తుంటే తేజ వద్దని అన్నారు. దానికి కారణం మహేశ్ బాబు మీద గౌరవంతోనే అన్నాడు తప్ప.. అక్కడ మహేశ్ ను అవమానించింది ఏమీ లేదు. కానీ తేజ సజ్జా మాత్రం తన హనుమాన్ మూవీతో గుంటూరు కారం సినిమాను ఓడించాడనే రేంజ్ లో కామెంట్స్ చేశాడని మహేశ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఒక రకంగా మహేశ్ ఫ్యాన్స్ ఆయన కామెంట్స్ ను తప్పుగా అర్థం చేసుకున్నారు.
అందుకే ఇలా పోస్టులు పెడుతున్నారని అంటున్నారు. కాబట్టి వీటిని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని కొందరు ట్రేడ్ పండితులు చెబుతున్న మాట.