Switch to English

రంజాన్‌ ‘నైట్‌ మార్కెట్‌’కి కరోనా చీకట్లు.!

హైద్రాబాద్‌ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది బిర్యానీ.. దాంతోపాటే, రంజాన్‌ స్పెషల్‌ అయిన హలీం. ఇంకో స్పెషల్‌ కూడా వుంది రంజాన్‌ సందర్భంలో. అదే నైట్‌ బజార్‌. హైద్రాబాద్‌లోని పాత బస్తీలోగల చార్మినార్‌ ప్రాంతంలోని నైట్‌ బజార్‌ రంజాన్‌ సీజన్‌లో కళకళ్ళాడిపోతుంటుంది.

పగలంతా అక్కడ మామూలు హడావిడి మాత్రమే వుంటుంది. సాయంత్రం అసలు సిసలు వెలుగులు కన్పిస్తాయి. అది నైట్‌ బజార్‌ ప్రత్యేకత. అర్థరాత్రి సమయానికి ఈ స్పెషల్‌ బజార్‌లో కొనుగోళ్ళు వేగం పుంజుకుంటాయి. గాజులు, రకరకాల వస్త్రాలు, పెర్‌ఫ్యూమ్ లు ఇలా ఒకటేమిటి.? అన్నీ ఇక్కడ ప్రత్యేకమే. ప్రత్యేకమైన వంటకాలు, అందునా ముస్లిం సంప్రదాయ వంటకాలు, విదేశీ వంటకాలు ఇక్కడ భోజన ప్రియుల్ని అలరిస్తుంటాయి. కోట్లాది రూపాయల వ్యాపారం రంజాన్‌ మాసం అంతటా జరుగుతుంటుంది.

అయితే, ఈ ఏడాది ఆ వెలుగులు కన్పించడంలేదు. చాలామంది సినీ ప్రముఖులు, ప్రత్యేకించి హీరోయిన్లు.. రంజాన్‌ నైట్‌ మార్కెట్‌ని ప్రత్యేకంగా ఎంజాయ్‌ చేస్తుంటారు.. అది కూడా కొన్ని సందర్భాల్లో మారు వేషాల్లో. అంతమంది జనంలోకి వెళితే, ఎవరన్నా గుర్తుపడితే.. ఇంకేమన్నా వుందా.? అయితే, కొందరు మాత్రం.. అక్కడికి వెళ్ళి వచ్చిన విషయాన్ని అందరికీ తెలిసేలా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంటారు కూడా.

ప్రపంచంలోని అత్యున్నత నగరాల్లో షాపింగ్‌ అనుభూతి సంగతెలా వున్నా, హైద్రాబాద్‌లో రంజాన్‌ సందర్భంగా నైట్‌ బజార్‌లో షాపింగ్‌ మాత్రం చాలా చాలా ప్రత్యేకమంటారు సెలబ్రిటీలు. ఈ సారి హైద్రాబాద్‌లో రంజాన్‌ నైట్‌ బజార్‌ హంగామా అస్సలేమాత్రం లేకపోవడం పట్ల సెలబ్రిటీలూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంట్లోంచి కాలు బయటకు పెట్టలేని పరిస్థితి నిన్న మొన్నటిదాకా కన్పించింది. ఇప్పుడిప్పుడే కాస్తంత సడలింపులు వచ్చాయి. దాంతో, నైట్‌ బజార్‌ లాంటి ప్రత్యేక హంగామా లేకపోయినా.. పాత బస్తీలో రంజాన్‌ కళ కొంచెం కొంచెంగా ఇప్పుడిప్పుడే కన్పిస్తోంది.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

తాప్సీ ఇంట్లో విషాదం.. ఓదారుస్తున్న అభిమానులు.!

తెలుగు సినిమాల్లో తన గ్లామర్ తో నటనతో ఆకట్టుకున్న నటి తాప్పీ. పంజాబ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ ఝుమ్మంది నాదం సనిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇటీవల తెలుగులో తన హవా...

బ్రేకింగ్ న్యూస్: 12 గంటల్లో ఢిల్లీలో రెండు భారీ అగ్ని ప్రమాదాలు.!

సోమవారం అర్ధరాత్రి 12 గంటల 50 నిమిషాలకి ఢిల్లీలోని తుగ్లకాబాద్‌ మురికివాడలో మంటలు చెలరేగాయి.ఈ మంటలు సుమారు రెండు ఎకరాల మేర వ్యాపించడంతో అక్కడున్న దాదాపు 1500 గుడిసెలు ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదం...

ప్రపంచ అత్యంత వయో వృద్దుడు మృతి

ప్రపంచంలోనే అతి పెద్ద వయసు వ్యక్తిగా బాబ్‌ వెయిటన్‌ రికార్డు సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జపాన్‌కు చెందిన చిటెట్సు మృతి చెందడటంతో అత్యంత వృద్దుడిగా అధిక వయసు కలిగిన వ్యక్తిగా బాబ్స్‌...

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

ఆ వైసీపీ ఎమ్మెల్సీలపై వేటు ఖాయమా?

కరోనా విజృంభిస్తున్న తరుణంలోనూ ఏపీలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. అధికార, విపక్షాలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఒకరిపై విమర్శలు, ఆరోపణలు షరా మామూలుగానే...