రామ్ చరణ్ 15 వ చిత్రం..దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న విషయం తెలిసిందే.. తాజాగా ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ షూటింగ్ లో పాల్గొనే నిమిత్తం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. నిన్న ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకున్నారు.. విమనాశ్రయంలో రామ్ చరణ్ కు ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు.
ఒక తనయుడి గా.. మెగాస్టార్ చిరంజీవి కి గాడ్ ఫాదర్ వంటి మెగా హిట్ అందించటంలో కీలక పాత్ర పోషించిన రామ్ చరణ్ కు.. అభిమానులు ఈ సందర్బంగా రామ్ చరణ్ కు ముఖ్యంగా తమ కృతజ్ఞతలు తెలిపారు.
రంపచోడవరం వద్ద గ్రామీణ వాతావరణం కోసం .. ఈ షూటింగ్ ను అక్కడ చేస్తున్నట్లు తెలిసింది.. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు, అందులో ఒక పాత్రకు రామ్ చరణ్ కు జోడీగా హీరోయిన్ అంజలీ నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
హీరో శ్రీకాంత్ కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు..
రంపచోడవరం వద్ద జరుగుతోన్న ఈ షూటింగ్ లో .. శ్రీకాంత్, అంజలి ల పై కూడా కొన్ని దృశ్యాలు చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది.. ఇక్కడ ఈ షూటింగ్ ఈరోజు నుంచి 6 రోజుల పాటు జరుగుతుందని తెలిసింది..