రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ డీసెంట్ అంచనాల మధ్య విడుదలై ఈరోజే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాజిటివ్ బజ్ తెచ్చుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ:
శ్రీకాకుళంలో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసే రామారావు (రవితేజ) డిమోషన్ మీద తన సొంత రూలో ఎమ్మార్వోగా నియమితుడవుతాడు. అయితే ఆ ఊర్లో వరసగా జరిగే కిడ్నప్ లపై దృష్టి సారిస్తాడు. తన మాజీ లవర్ రజిష విజయన్ భర్త కూడా కిడ్నప్ అవుతాడు. ఈ కిడ్నప్ లోతుగా వెళ్తే ఎర్రచందనం కేసుతో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకే ఇలా జరుగుతోందని రామారావుకు అర్ధమవుతుంది. మరి అప్పుడు తను ఏం చేస్తాడు? ఇదంతా చేసిన వారిని పట్టుకోగలిగాడా? లేదా?
నటీనటులు:
రవితేజ అంటే ఎనర్జీ. తన మాస్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అయితే రామారావు ఆన్ డ్యూటీలో తన ఎనర్జీని బాగా తగ్గించుకుని నటించాడు. సెటిల్ రోల్ లో చక్కగా సరిపోయాడు రవితేజ. కీలకమైన సన్నివేశాల్లో రవితేజ నటన సూపర్బ్. కానీ రవితేజ ఎనర్జీని ఈ సినిమాలో కచ్చితంగా మిస్ అవుతాం.
రజిష విజయన్, దివ్యంశ కౌశిక్ ఇద్దరికీ కూడా లిమిటెడ్ పాత్రలే దక్కాయి ఈ చిత్రంలో. వేణు తొట్టెంపూడి ఎస్సై మురళిగా ఈ సినిమా ద్వారా కంబ్యాక్ ఇచ్చాడు. ఈ పాత్ర గురించి చాలా చెప్పారు కానీ ఆ స్థాయిలో అయితే లేదు. మెయిన్ విలన్ గా నటించిన జాన్ విజయ్ పర్వాలేదు. నాజర్, నరేష్ లకు కీలకమైన పాత్రలు దక్కాయి.
సాంకేతిక నిపుణులు:
మాస్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రెస్ అయిన రవితేజను తీసుకుని థ్రిల్లర్, సస్పెన్స్ ఎలెమెంట్స్ ఉన్న కథను చేయాలనుకోవడం సాహసమే. ఆ అటెంప్ట్ చేసినందుకు శరత్ మండవను అభినందించాల్సిందే. అయితే ఈ కథను ఆసక్తికరంగా మలచడానికి మల్టీపుల్ జోనర్స్ ను టచ్ చేసి దేనికీ న్యాయం చేయలేకపోయాడు. రవితేజ పాత్రకు ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది. స్లో గా, అన్ ఈవెన్ గా సాగే స్క్రీన్ ప్లే నరేషన్ ను నీరుగార్చేసింది. ఈ చిత్రంలో ముఖ్యంగా కిడ్నాప్ ట్రాక్, హీరో – విలన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ మెయిన్ గా అనిపిస్తాయి. అయితే ఆ విషయంలో రామారావు ఆన్ డ్యూటీ పూర్తిగా నిరుత్సాహపరుస్తుంది.
సామ్ సీఎస్ ఈ సినిమాకు డీసెంట్ మ్యూజిక్ అందించాడు. తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కొన్ని సీన్స్ కు డీసెంట్ ఎలివేషన్ ఇచ్చాడు. పాటలు బాగానే ఉన్నాయి కానీ వాటి ప్లేస్మెంట్స్ వల్ల ఎఫెక్ట్ దెబ్బతింటుంది. ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉండొచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. థ్రిల్లర్ సినిమా అయిన రామారావు ఆన్ డ్యూటీలో రెండు హాఫ్స్ లో కూడా ల్యాగ్ స్పష్టంగా తెలుస్తుంది. నిర్మాణవిలువలకు ఢోకా లేదు.
పాజిటివ్ పాయింట్స్:
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- సినిమాటోగ్రఫీ
నెగటివ్ పాయింట్స్:
- అవసరం లేని సబ్ ప్లాట్స్, ల్యాగ్ సీన్స్
- డైలాగ్స్
- సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్స్
చివరిగా:
రామారావు ఆన్ డ్యూటీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్. అయితే ఈ రెండు అంశాల్లో కూడా ఈ చిత్రం ఫెయిల్ అయిందనే చెప్పాలి. అటు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు లేకుండా దేనికీ కాకుండా చెడింది ఈ చిత్రం. కనీసం రవితేజ ఫ్యాన్స్ కు కూడా ఈ చిత్రం నచ్చే అవకాశాలు తక్కువే.
తెలుగుబులెటిన్ రేటింగ్: 2.25/5