Switch to English

రంజాన్‌ స్పెషల్‌: ‘హలీం’కి ఊరట దక్కేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

హలీం.. రంజాన్‌ స్పెషల్‌ వంటకం ఇది. కేవలం ముస్లింలకు మాత్రమే కాదు.. అన్ని మతాలకు చెందిన భోజన ప్రియుల్నీ తనవైపుకు తిప్పుకున్న ప్రత్యేక వంటకంగా హలీం గురించి చెప్పుకోవచ్చు. ఎక్కడో విదేశాల్లో పుట్టి, హైద్రాబాదీ స్పెషల్‌గా మారిన హలీం, రంజాన్‌ మాసంలో హైద్రాబాద్‌లో ఎక్కడ చూసినా దర్శనమిస్తుంటుంది.

ఆ మాటకొస్తే, హైద్రాబాద్‌లోనే కాదు.. దేశమంతటా హలీం రుచులు భోజన ప్రియుల్ని చవులూరిస్తుంటాయి. అయితే, కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ ఏడాది హలీం వాసన ఎక్కడా తగల్లేదు. ఎట్టకేలకు లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు రావడంతో, కొన్ని రెస్టారెంట్లు.. కొద్ది రోజులే అయినా హలీంని తయారు చేయాలని భావిస్తున్నాయట.

హోటళ్ళు, రెస్టారెంట్స్‌లో ‘పార్సిల్స్‌’కి ప్రభుత్వాలు అనుమతివ్వడం, హోమ్ డెలివరీలు సైతం అందుబాటులోకి రావడం.. వీటితోపాటు, స్విగ్గీ – జొమాటో వంటి సంస్థలకూ అనుమతులు లభించడంతో రంజాన్‌ మాసంలో మిగిలిన కొద్ది రోజులే అయినా రంజాన్‌ స్పెషల్‌ హలీం ఆహార ప్రియుల్ని అలరించే అవకాశాలున్నాయట.

అయితే, హలీం తయారీ అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఇందుకోసం ప్రత్యేకంగా హలీం బట్టీలు తయారు చేయాలి. దీనికి తోడు, స్పెషలిస్ట్‌లైన వంటగాళ్ళు, వాళ్ళకు తోడుగా కూలీలు కూడా అవసరమవుతారు. ఇదంతా ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదన్న అభిప్రాయాలూ లేకపోలేదు.

మరోపక్క, రంజాన్‌ స్పెషల్‌ హలీంని ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలా.? అని హలీం ప్రియులు యూ ట్యూబ్‌లో వెతికేస్తున్నారట. ఇలా వెతుకుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందనీ, చాలామంది ఇంట్లోనే తమకు తోచిన విధంగా హలీం తయారు చేసేసుకుంటున్నారనీ తెలుస్తోంది.

ఎంత గొప్పగా ఇంట్లో తయారు చేసుకుంటున్నా… హైద్రాబాదీ స్పెషల్‌ హలీం.. ప్రత్యేకంగా రెస్టారెంట్లు, హోటళ్ళు ఏర్పాటు చేసిన హలీం బట్టీల దగ్గర దొరికినంత రుచిగా కుదరడం సాధ్యమయ్యే పని కాదన్నది హలీం ప్రియుల వాదన. ఇదిలా వుంటే, ఈసారి రంజాన్‌ తమను తీవ్రంగా నిరాశపర్చిందని హలీం వ్యాపారులు చెబుతున్నారు.

రంజాన్‌లో మాత్రమే లభించే హలీం ద్వారా తమకు ఏడాదికి సరిపడా ఆదాయం లభించేదని, ఇప్పుడు ఆ ఆదాయం కోల్పోయామని వాపోతున్నారు చిన్నా చితకా హలీం వ్యాపారులు. బడా రెస్టారెంట్లదీ ఇదే పరిస్థితి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...