Ram Gopal Varma: ‘మనిషికో ఆలోచన ఉంటుంది.. అలానే వేలల్లో పోస్టులు చేశాను. ఏడాది క్రితం చేసిన పోస్టులకు ఇప్పుడు ఎవరో నలుగురి మనోభావాలు దెబ్బతినడం.. కేసు పెట్టడమేంట’ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘నేనెవరికీ భయపడలేదు. ఎక్కడికీ పారిపోలేదు. హైదరాబాద్ లోనే ఉన్నా. ప్రకాశ్ రాజ్, నాగార్జున నన్ను దాచారంటూ వార్తలు వచ్చాయి.’.
‘పోలీసులు వచ్చారు.. నోటీసులు ఇచ్చారు అంతకుమించి ఏమైంది..? నన్ను అరెస్టు చేస్తే జైలుకెళ్లి నాలుగు కథలు రాసుకుంటా. దీనికిపోయి కేరళ, కోయంబత్తూరులో వర్మ కోసం జల్లెడ పడుతున్న పోలీసులంటూ ప్రధాన మీడియా వార్తలు ప్రచారం చేసింది. పోలీసుల కంటే మీడియా డిటెక్టివ్ అయిపోయింది. నాకున్న షూటింగులతో బిజీ ఎక్కువైంది. అందువల్ల కోర్టుకు రాలేనని విన్నవించుకున్నా.
‘సోషల్ మీడియాలో అతి చేయొద్దని నాకు చెప్తున్నారు. మీమ్స్, అసభ్య పదాలతో దూషిస్తున్నారు. అమెరికానే మీమ్స్ ను నియంత్రించలేక పోయింది. ఒక కార్టూన్ ను అనేక రకాలుగా అర్ధం చేసుకోవచ్చు. నేను వేలల్లో పోస్టులు చేశా’నని అన్నారు.