ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళల పతంజలి యోగ సమితి సంయుక్తంగా యోగ సైన్స్ శిబిరాన్ని ఇటీవలే నిర్వహించాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్ తో పాటు పలువురు ప్రముఖ మహిళలు ఆ శిబిరానికి హాజరయ్యారు.
అక్కడ శిక్షణ శిబిరం ముగిసిన వెంటనే మీటింగ్ జరగడం, ఆ మీటింగ్ కు సమయాభావం వల్ల దుస్తులు మార్చుకోలేక యోగ దుస్తుల్లోనే హాజరయ్యారు మహిళలు.
ఆ సంఘటనపై రామ్ దేవ్ బాబా స్పందిస్తూ మహిళలు ఎలాంటి దుస్తుల్లోనైనా బాగుంటారని, హీరోలు, సల్వార్ సూట్, ఇలా ఎక్కడైనా అందంగా ఉంటారు. చీరలు ఇంటికి వెళ్ళాకైనా ధరించొచ్చు. నా కళ్ళకైతే మహిళలు దుస్తులు ధరించకపోయినా బాగుంటారు అంటూ నోరు తుళ్ళారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా సహా అన్ని వేదికల్లోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.