Ram Charan: “బాలీవుడ్‌లోకి రామ్ చరణ్..! భన్సాలీ ప్రొడక్షన్‌లో భారీ ప్లాన్..!”

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,456FansLike
57,764FollowersFollow

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ ప్రాజెక్టులో భాగమవుతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో రామ్ చరణ్ సినిమా అనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ నూ బాగా షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతూండటంతో అభిమానుల్లోనూ జోష్ నింపుతోంది. జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగే కథను భారీ కాన్వాస్ లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు భన్సాలీ నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. బాలీవుడ్ అగ్ర దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే రామ్ చరణ్ కు కథ వినిపించినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ ఇమేజ్ కు తగ్గట్టు కథ, స్క్రీన్ ప్లే లో కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ వార్తలపై పూర్తి సమాచారం రివీల్ కావాల్సి ఉంది. అఫిషియల్ ఇన్ఫో వస్తే సినిమాపై అంచనాలకు ఆకాశమే హద్దు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్, యాక్షన్ అడ్వెంచర్ అంటే గుర్రపుస్వారీలు, చేజింగ్ లు, భారీ యాక్షన్ తప్పకుండా ఉంటాయి. దీంతో సినిమాపై ఎక్కడేలేని హైప్ వస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే రామ్ చరణ్ కెరీర్‌ కి మరో పెద్ద మలుపు అని చెప్పాలి.

ఇప్పటికే పాన్ ఇండియా మార్కెట్‌లో బలమైన స్థానం సంపాదించిన రామ్ చరణ్, ఈ సినిమాతో బాలీవుడ్‌లో కూడా మరింత గుర్తింపు తెచ్చుకుంటారని  అంటున్నారు. ఇప్పటికీ అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఈ కాంబినేషన్ నిజమైతే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’లో నటిస్తున్నారు. తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఆ తర్వాతే ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

భారీ కాన్వాస్ సినిమాలకు సంజయ్ లీలా భన్సాలీ కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి. బాలీవుడ్ లో ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ చాలా గ్రాండియర్ గా తెరకెక్కుతాయి. దేవదాస్, గుజారిష్, రామ్-లీలా, రౌడీ రాథోడ్, భాజీరావ్ మస్తానీ, పద్మావత్, గంగూభాయ్ కతియావాడీ.. వంటి భారీ సినిమాలు ఆయన నుంచి వచ్చాయి. ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా కూడా అంతే గ్రాండ్ స్కేల్ ఉన్న సినిమాగా చెప్తున్నారు. రామ్ చరణ్ కటౌట్ కి సరిపోయే కథతో సినిమా తెరకెక్కుతోందని.. భారీ కాన్వాస్ తో భన్సాలీ మార్క్ తో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. రామ్ చరణ్ కెరీర్లో ఈ సినిమా ఓ ల్యాండ్ మార్క్ లా నిలిచేలా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సినిమా

Urvashi Rautela: కేన్స్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా..! ఆమె లుక్...

Urvasi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, డాకూ మహారాజ్, బ్లాక్ రోజ్, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్...

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి...

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు...

రాజకీయం

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

పెట్రోల్ పొదుపునకు కాన్వాయ్ సగం తగ్గించిన పవన్ కళ్యాణ్

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌరవ ప్రధాన మంత్రి Narendra Modi సూచించిన పొదుపు చర్యలకు మద్దతుగా...

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ .. పెదపాడు పిల్లలకు కొత్త స్కూల్ భవనం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మాణం పూర్తయింది....

ఎక్కువ చదివినవి

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జనసేన నేత ప్రేమ్ కుమార్

హనుమాన్ జయంతి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు దూరమవడం, ఓటీటీ ప్రభావం, హీరోల సినిమా...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి.. సింగిల్ స్క్రీన్...

“ఇది ఎగ్జిబిటర్ల బ్రతుకు పోరాటం”.. పర్సెంటేజ్ షేరింగ్ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక డిమాండ్

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ, పరిరక్షణ కోసం “పర్సెంటేజ్ షేరింగ్ విధానం”ను అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మరోసారి గట్టిగా డిమాండ్ చేసింది. ఈ అంశంపై హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ...

Daily Horoscope: కర్కాటక రాశివారికి ఆర్థిక లాభ సూచనలు.. తుల రాశివారికి కొత్త పరిచయాలతో ప్రయోజనం!

మే 13 , 2026 బుధవారం రాశిఫలాలు: ఈరోజు చంద్రಮಾನ పంచాంగం ప్రకారం గ్రహస్థితుల్లో కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం మరియు ఆర్థిక విషయాల్లో కొన్ని రాశుల వారికి అనుకూల పరిస్థితులు...