Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా `గేమ్ చేంజర్`. ఇప్పటికే విడుదలైన రెండు లిరికల్ సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఈమధ్య విడుదలైన రా మచ్చా.. పాట దేశం మొత్తాన్ని ఊపేస్తోంది. విడుదలైన 24గంటల్లో 23మిలియన్ వ్యూస్ కూడా సాధించింది.
రామ్ చరణ్ లుక్స్, డ్యాన్స్ లో గ్రేస్ తో పాట హోరెత్తిపోయింది. యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టా రీల్స్ మొత్తం రా మచ్చా.. పాటతో మొగిపోతోంది. ఈ నేపథ్యంలో రా మచ్చా.. పాట ఖండాంతరాల ఖ్యాతి పొందుతోంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ పాప్ సింగర్ పార్క్ మిన్ జున్ (ఆరా) తన బృందంతో కలిసి ఈ పాటకు డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి తమన్ సైతం vibe.. vibe అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
దీంతో ఫ్యాన్స్ రామ్ చరణ్ క్రేజ్ కు మురిసిపోతున్నారు. కొరియన్ సింగర్ డ్యాన్స్ రీల్ ను షేర్ చేస్తున్నారు. సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కిన సినిమాను నిర్మాత దిల్ రాజు భారీ ఖర్చుతో నిర్మించారు. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న సినిమా 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.
https://x.com/MusicThaman/status/1847989327290064917?t=IkDBuh94u0c11h90GJqcUw&s=19