OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ ఓజీ (OG). సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మరో ఆసక్తికరమైన టాక్ బయటికి వచ్చింది.
సినిమాలో కీలకమైన పాత్ర కోసం పవన్ తనయుడు అకీరా నందన్ ను తీసుకోవాలని.. పవన్ అనుమతి తీసుకుని.. అకీరా పై కొంత భాగం కూడా షూట్ చేశారని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ కూడా ఇందుకు అద్యం పోశాయి.
అయితే.. అవేమీ ఓజీ షూటింగ్ కోసం కాదని కూడా వార్తలు వచ్చాయి. మధ్యలో ప్రభాస్ పేరు కూడా వినిపించింది.. అదీ నిజం కాదని తేలిపోయింది. ఇప్పుడు మరో సంచలమైన టాక్ నడుస్తోంది.. సినిమాలో అంతటి ముఖ్యమైన పాత్ర కోసం దర్శకుడు సుజీత్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను అనుకుంటున్నారని.. ఇప్పటికే ఆయన్ను కలిసి కథ, పాత్ర వివరించినట్టు సమాచారం.
ఇదే నిజమైతే అభిమానులకు మంచి జోష్ ఇచ్చే సందర్భమే. పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ ఆఫ్ స్క్రీన్ బాండింగ్ తెరపై కూడా కలిసి కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమే. దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.