Ram Charan: లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటైంది. దీంతో భారతదేశంలోని అతికొద్దిమంది సెలబ్రిటీలు దక్కించుకున్న గౌరవాన్ని రామ్ చరణ్ సైతం పొందారు. అయితే.. విగ్రహావిష్కరణలో భారతదేశంలో ఇప్పటివరకూ ఎవరూ సాధించని అరుదైన ఘనతనూ పొందారు.
తన పెంపుడు శునకం ‘రైమ్’ తో రామ్ చరణ్ కలిసున్న మైనపు విగ్రహం ఏర్పాటయింది. ఇలా పెంపుడు జంతువుతో కలిసి మైనపు విగ్రహం కలిగిన ప్రపంచంలోని రెండో సెలబ్రిటీగా రామ్ చరణ్ అరుదైన ఘనత సాధించారు. ఇంతకుముందు కేవలం రాణి ఎలిజబెత్-2 కు మాత్రమే పెంపుడు జంతువుతో కలిసున్న మైనపు విగ్రహం ఏర్పాటైంది. దీంతో రామ్ చరణ్ మేడమ్ టుస్సాడ్స్ లో ప్రత్యేకంగా నిలిచారు.
విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రామ్ చరణ్ తోపాటు ఉపాసన, క్లింకారా, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం లండన్లో ఏర్పాటైన విగ్రహం త్వరలో శాస్వతంగా ఉండేలా సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలించనున్నారు.
