Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’. సెన్సేషనల్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిందీ సినిమా. ఇప్పటికే విడుదలైన రామ్ చరణ్ లుక్స్, రెండు లిరికల్ సాంగ్స్, రామ్ చరణ్ లుక్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈక్రమంలో చెన్నైలొ జరిగిన ప్రెస్ మీట్లో నిర్మాత దిల్ రాజు సినిమా ప్రమోషన్ వివరాలు ప్రకటించారు.
‘సంక్రాంతి జనవరి 10న గేమ్ చేంజర్ విడుదలవుతోంది. సందర్భంగా ప్రమోషనల్ ఈవెంట్స్ ప్రారంభించబోతున్నాం. ముందుగా నవంబర్ 9న లక్నోలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి టీజర్ విడుదల చేయబోతున్నాం. అనంతరం.. చెన్నై, అమెరికాల్లో సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలు చేస్తాం. తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా జనవరి మొదటి వారంలో ఈవెంట్ కు ప్లాన్ చేస్తున్నా’మని అన్నారు.
రామ్ చరణ్ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ దిల్ రాజు ప్రకటనతో సంతోషంలో మునిగిపోయారు. ఇటివల విడుదలైన రా.. మచ్చా పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.