Switch to English

రామ్ చరణ్ @15..! నటన, వ్యక్తిత్వం, వారసత్వం.. అన్నింటా ‘శిఖరమే’

91,313FansLike
56,997FollowersFollow

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి.. నవ్విన నాప చేను పండుతుంది.. మనుషులు వారి జీవితాలకి సంబంధించిన సామెతలు ఇవి. ఈ సామెతల బలం ఎంతో.. నిజం జీవితంలో చేసి చూపించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ కీర్తి ఎల్లలు దాటింది. టాలీవుడ్ నుంచి.. బాలీవుడ్ మీదుగా హాలీవుడ్ వరకూ రామ్ చరణ్ నటనా కౌశలాన్ని కీర్తించిన వారే.

ఏ బాలీవుడ్ క్రిటిక్స్ తనను విమర్శించారో.. అదే బాలీవుడ్ క్రిటిక్స్, మీడియా వేనోళ్ళ కీర్తించేలా నటనలో రాటుదేలాడు రామ్ చరణ్. మార్వెల్ లూక్ కేజ్ సృష్టికర్త చియో హోదారి కోకర్ ఏకంగా రామ్ చరణ్ నటనకు ఫిదా అయిపోయాడు. జేమ్స్ బాండ్ పాత్రకు రామ్ చరణ్ ఒక చాయిస్ అని ట్వీట్ చేయడం చరణ్ సాధించిన కీర్తి, నటనా స్థాయికి నిదర్శనం.

తండ్రిలానే సూపర్ స్టార్ స్టేటస్..

తనకంటూ ఓ స్టైల్, ఇమేజ్, మార్కెట్ తెచ్చుకున్న రామ్ చరణ్.. తన స్టార్ స్టేటస్ ఏమాత్రం తగ్గకుండా సూపర్ స్టార్ స్టేటస్ అందుకోవడం చిరంజీవికి ఎనలేని సంతోషాన్నిస్తోందని చెప్పాలి. ఇటివలి గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ ‘రామ్ చరణ్ నా ప్రైడ్’ అని చెప్పిన విషయం తెలిసిందే. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం తండ్రి నుంచి నేర్చుకున్న మంచి లక్షణంగా చెప్పాలి. తండ్రి పేరు నిలబెట్టడమే కాదు.. క్రమశిక్షణ, వ్యక్తులకు ఇచ్చే గౌరవంలో కూడా తండ్రి స్థాయినే అందుకున్నాడని చెప్పాలి.

రామ్ చరణ్ @15..! నటన, వ్యక్తిత్వం, వారసత్వం.. అన్నింటా ‘శిఖరమే’

సెట్ లో తాను చిరంజీవి కొడుకు అనే హోదా చూపించరు.. అందరితో సరదాగా ఉంటారని చరణ్ సహ నటీనటులెవరైనా చెప్పే మాట. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో కూడా ఎంతో సైలంట్ గా ఉన్న చరణ్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. అయ్యప్ప దీక్షలో ఉండి చెప్పులు లేకుండా కనపడటం చరణ్ పై వారికి అభిమానం కలిగేలా చేసింది.

వ్యక్తిత్వంలో శిఖరం..

రామ్ చరణ్ తన తోబుట్టువులు సుస్మిత, శ్రీజతోపాటు.. వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పై అదే ఆప్యాయత చూపుతారని.. కెరీర్ విషయంలో విలువైన సలహాలు ఇస్తూంటారని నాగబాబు ఓ సందర్భంలో చెప్పారు. భార్య ఉపాసన కూడా చరణ్ వ్యక్తిత్వంపై ఎన్నోసార్లు గొప్పగా చెప్పారు. జానీ మాస్టర్ కు చరణ్ చేసిన సాయం ఆయనలోని మానవత్వానికి నిదర్శనం. అభిమానులను కూడా అంతే ఆదరణతో చూడటం చరణ్ ప్రత్యేకత.

రామ్ చరణ్ @15..! నటన, వ్యక్తిత్వం, వారసత్వం.. అన్నింటా ‘శిఖరమే’

గతంలో ఓ చిన్నారికి అందిన సాయంపై రెండేళ్ల తర్వాత ‘పాప ఇప్పుడెలా ఉంది..’ అని అడగటం చరణ్ గొప్ప మనసుకి నిదర్శనమని నటుడు కాదంబరి కిరణ్ చెప్పారు. నేటితో రామ్ చరణ్ కు ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తవుతున్నాయి. సెప్టెంబర్ 28, 2007న ఆయన మొదటి సినిమా ‘చిరుత’ విడుదలైంది. ఇన్నేళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగిన రామ్ చరణ్ రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ‘తెలుగు బులెటిన్’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

లైగర్.. ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ

లైగర్ హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్ లోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు. ఆగష్టులో విడుదలైన ఆయన హీరోగా నటించిన...

‘స్టార్ హీరోతో ప్రేమాయణం..’ క్లారిటీ ఇచ్చిన కృతి సనన్

తాను ఓ స్టార్ హీరోతో ప్రేమలో ఉన్నట్టు ఇటివల వస్తున్న వార్తలన్నీ గాసిప్స్ అంటూ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కొట్టిపారేసింది. ‘నేను ప్రేమలో లేను. ఆ...

స్నో మ్యాన్ ఛాలెంజ్.! బిగ్ బాస్ హౌస్‌లో ‘మగధీర’.!

బాబోయ్.. ఇదేం టాస్క్ మహాప్రభో.! అది కూడా టిక్కెట్ టు ఫినాలె కోసం జరిగిన టాస్క్. ఇందులో కంటెస్టెంట్లు ఎంత సీరియస్‌గా పాల్గొనాలి.? కానీ, అందరికీ...

పిక్ టాక్: చీర కట్టు ఊర్వశి… మతిపోగొడుతున్న రాక్షసి

రీసెంట్ గా ఊర్వశివో రాక్షసివో చిత్రంలో కనిపించింది అను ఇమ్మానుయేల్. చాలా కాలం తర్వాత ఆమెకు మంచి రోల్ పడింది. అల్లు శిరీష్ సరసన నటించి...

దిల్ రాజు రెండో పెళ్లి వెనుక ఏం జరిగిందో తెలుసా?

ఇటీవలే అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రముఖ టాక్ షో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకు గెస్ట్ గా వచ్చిన విషయం తెల్సిందే. ఈ ప్రోగ్రాంలో...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌తో మనకి పనేంటి.? విజయమ్మ వ్యాఖ్యల వెనుక.!

‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మనకు పనేంటి.?’ అని వైఎస్ విజయమ్మ ప్రశ్నిస్తే, దాన్ని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే, అది వారి కుటుంబ వ్యవహారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్ష పదవి...

హైద్రాబాద్‌లో వైఎస్ షర్మిల చేసింది ‘డ్రామా’ కాదు కదా.?

అటు ‘సున్నితమైన ప్రాంతం’ భైంసాలో బీజేపీ బహిరంగ సభ.! ఇటు హైద్రాబాద్‌లో వైఎస్ షర్మిల హైడ్రామా.! ఇంకోపక్క, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని తెలంగాణకు బదిలీ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునివ్వడం.! ఈ...

జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ..! విలువ ఎంతంటే..?

టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన సంస్థల ఆస్తులను అటాచ్ చేసినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఓ ప్రకటన విడుదల చేసింది. జేసీ...

వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు లో ఊరట లభించింది. వ్యక్తి గత పూచికత్తుపై ఆమెకు బెయిల్ కోర్టు మంజూరు చేసింది. షర్మిలతో పాటు మరో ఐదుగురికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రగతి...

ఉపాధ్యాయులకు బిగ్ రిలీఫ్..! రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉపాధ్యాయుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులను ఇకపై బోధనేతర విధుల నుంచి తప్పిస్తూ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం ఇకపై ఉపాధ్యాయులు విద్యా...

ఎక్కువ చదివినవి

కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ‘అయ్యా.! యెస్.!’ అనాల్సిందేనా.?

కేంద్రంలో అధికారంలో వున్న పార్టీలకు ‘యెస్’ అనేలా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందా.? సర్వోన్నత న్యాయస్థానం అబ్జర్వేషన్ ఇదే.! చిన్న విషయంగా దీన్ని చూడలేం. సర్వోన్నత న్యాయస్థానం ఎంతో ఆవేదనతో చేసిన వ్యాఖ్యలివి. కేంద్ర...

ఆంధ్రప్రదేశ్‌తో మనకి పనేంటి.? విజయమ్మ వ్యాఖ్యల వెనుక.!

‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మనకు పనేంటి.?’ అని వైఎస్ విజయమ్మ ప్రశ్నిస్తే, దాన్ని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే, అది వారి కుటుంబ వ్యవహారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్ష పదవి...

లైగర్.. ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ

లైగర్ హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్ లోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు. ఆగష్టులో విడుదలైన ఆయన హీరోగా నటించిన లైగర్ సినిమా లావాదేవీల అంశంలో ఈడీ...

నాన్నగారు నాకు చాలా ఇచ్చారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్‌స్టార్‌ కృష్ణ గారి పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు మాట్లాడుతూ..‘నాన్న గారు నాకు చాలా ఇచ్చారు....

ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం.. జీవితాంతం సినిమాల్లోనే: చిరంజీవి

‘గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవాల్లో ఒక్క దక్షిణాది నటుడి ఫొటో లేదని బాధపడ్డా.. ఇప్పుడు ఇక్కడే అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చినందుకు ఇఫి, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని...