Ram Charan: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘అన్ స్టాపబుల్-4’ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. బాలకృష్ణ-రామ్ చరణ్ సందడి సరదా సంభాషణలతో షో సాగింది.
‘1992లో సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చింది. మేమే ఆలస్యంగా వచ్చాం. అప్పుడు మేమంతా చిన్నపిల్లలం. బాలకృష్ణగారు వచ్చి.. చిరంజీవి, మీ అబ్బాయిని పంపించు.. మా పిల్లలతో కలసి రెస్టారెంట్ కి తీసుకెళ్తా అన్నారు. ఇది నాకెంతో గుర్తు..’ అంటూ బాలకృష్ణతో ఉన్న అనుబంధాన్ని.. గుర్తు చేసుకున్నారు రామ చరణ్.
నువ్వు మిస్ అయ్యాననిపించే సినిమా ఏదని బాలకృష్ణ అడగ్గా.. ‘ఆదిత్య 369’.. అనవసరంగా చేశాననిపించిన సినిమా ‘జంజీర్’ అని రామ్ చరణ్ అన్నారు. ఆ సినిమా ఎందుకు చేశానో నాకే తెలీదని అన్నారు. మహేశ్, ప్రభాస్ తో మల్టీస్టారర్ చేయాల్సి వస్తే.. సీనియారిటీ ప్రకారం మహేశ్ తో చేస్తానని అనగా.. మహేశ్ అంటే నీకు భయమని నవ్వులు పూయించారు.
మగధీర-రంగస్థలం.. ఏ సినిమా ఇష్టమని అడగ్గా.. మగధీర చేశాను కాబట్టే రంగస్థలం వచ్చిందనుకుంటా.. అని అన్నారు రామ్ చరణ్.