Switch to English

Ram Charan Birthday Special: మూడు సినిమాలు.. మూడు భిన్నమైన పాత్రలు.. ‘రామ్ చరణ్’ స్పెషల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

Ram Charan Birthday Special: హీరోలు తెరపై తమ టాలెంట్ నిరూపిస్తేనే ప్రేక్షకులు ఆరాధిస్తారు. ఓ హీరో నుంచి కొత్త సినిమా వస్తుందంటే సినిమా కాకుండా.. ఆ హీరో నుంచి కొత్తదనం ఆశిస్తే వాళ్లు స్టార్స్ అయినట్టే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇదే చేసి చూపంచారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు హీరోగా వస్తున్నాడంటే అభిమానుల్లో ఎన్నో అంచనాలు.. ప్రేక్షకుల్లో ఎన్నో అనుమానాలు. సినిమా కోసం కాకుండా.. చిరంజీవి కొడుకు ఎలా నటించాడు, చిరంజీవిలా డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్, కామెడీ చేయగలడా..? అని చూసేందుకే వస్తారు. ఈ అనుమానాలు, ప్రశ్నలన్నింటికీ రామ్ చరణ్ తన మొదటి సినిమా చిరుతతోనే తిరుగులేని సమాధానం చెప్పేశాడు. చిరంజీవి కొడుకా మజాకా..! అని అభిమానులు.. చిరంజీవి పేరు నిలబెట్టాడు.. అని ప్రేక్షకులు ఫిక్సయిపోయేలా చేశాడు.

డెబ్యూ హీరోగా రికార్డులు..

తొలి సినిమా ‘చిరుత’తోనే డెబ్యూ హీరో రికార్డులు క్రియేట్ చేశాడు రామ్ చరణ్. లుక్స్, డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్.. అన్నింటిలో ప్రేక్షకులను మెప్పించాడు. మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన వచ్చే వరకూ డెబ్యూ హీరో రికార్డులు చిరుత పేరు మీదే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. రెండో సినిమా మగధీరలో స్కై లెవల్ పెర్ఫార్మెన్స్ తో ఏకంగా సౌత్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. గుర్రపుస్వారీలో తన నైపుణ్యం, 100 మెన్ ఫైట్లో యాక్షన్.. అన్నింటిలో మెప్పించి తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేసుకున్నాడు. రెండో సినిమానే ఫ్యాంటసీ కథ అయినా.. పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయిన తీరు తనను ఆశ్చర్యపరిచాయని దర్శకుడు రాజమౌళి చెప్పడం విశేషం. దీంతో విభిన్నమైన కాన్సెప్టులతో వచ్చిన తొలి రెండు సినిమాలతో రామ్ చరణ్ తనను తాను నిరూపించుకునే అవకాశం దక్కింది.

డ్యాన్సుల్లో గ్రేస్..

రామ్ చరణ్ వయసుకు తగ్గట్టు చేసిన సినిమా ఆరెంజ్. రామ్ చరణ్ లవర్ బాయ్ గా నటించిన సినిమాలో రామ్ చరణ్ లుక్స్, డ్రెస్సింగ్, నటన ప్రేక్షకుల్ని మెప్పించాయి. యువతను ఆకట్టుకునే అంశాలు, యూత్ ని ప్రతిబింబించే పాత్రలు, కథనం ఆకట్టుకుంటాయి. హీరో క్యారెక్టర్ లో మల్టీ డైమన్షన్ పాత్రను రామ్ చరణ్ అవలీలగా పోషించాడు. పాత్ర ఏదైనా తాను జీవిస్తానని నిరూపించాడు. సినిమాలో రామ్ చరణ్ డ్యాన్సింగ్ స్కిల్స్ అబ్బురపరిచాయి. డ్యాన్స్ అంటే బాడీ ఊపేయడం కాదు.. అని మగధీరలో చిరంజీవి చెప్పినట్టు ఆరెంజ్ పాటల్లో తన గ్రేస్ లెవల్స్ చూపించారు రామ్ చరణ్. కమర్షియల్ సక్సెస్ కాకున్నా రామ్ చరణ్ కెరీర్లో ఇదొక కీలకమైన సినిమగా నిలిచిపోయిందనేది నిర్వివాదాంశం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

రాజకీయం

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

ఎక్కువ చదివినవి

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...