Switch to English

Ram Charan Birthday Special: ‘వినయ విధేయ రామ్’ చరణ్..! మెగా వారసత్వమంటే అదే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

Ram Charan Birthday Special: ‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ..’ అనేది సుమీ శతకారుని వాక్కు..! ఈ వాక్యాన్ని నిజం చేసి తండ్రి చిరంజీవి (Chiranjeevi) కి పుత్రోత్సాహాన్ని ఇస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు రామ్ చరణ్ (Ram Charan) . తండ్రికి ఉన్న శిఖరంలాంటి ఇమేజ్ కు మాత్రమే వారసుడిగా కాకుండా.. ఆయనలోని వినయం, విధేయత, కష్టించేతత్వం, కుటుంబంపై బాధ్యత, అభిమానులపై ప్రేమ, ఎదుటివారికి ఇచ్చే గౌరవం, పనిలో దైవం.. ఇలా ప్రతి విషయంలోనూ చిరంజీవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan) ను దగ్గరగా చూసినవారైనా.. సోషల్ మీడియాలో అభిమానులైనా ‘చిరంజీవి పెంపకం’ అంత గొప్పది.. అనే మాట అంటున్నారంటే వారసత్వంగా రామ్ చరణ్ పొందింది ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

తండ్రి పేరు నిలబెడుతూ..

చిరంజీవి (Chiranjeevi) 2004లో తన పుట్టినరోజు వేడుకల్లో రామ్ చరణ్ ను అభిమానులకు మొదటిసారి పరిచయం చేస్తూ.. చరణ్ వెనుక నేనే కాదు.. మీరూ అండగా ఉండాలి అన్నారు. స్టాలిన్ వేడుకల్లో చరణ్ ను మీకు అప్పగిస్తున్నా.. అన్నారు. అలా మొదలైన రామ్ చరణ్ (Ram Charan) పయనం పరిచయమైన మూడేళ్లకే ఇండస్ట్రీ మోస్ట్ ప్రామిసింగ్ హీరో అయిపోయాడు. పదేళ్లకు సొంతంగా అభిమానులను సంపాదించుకునే స్థాయి.. మరో పదేళ్లకే ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకడిగా ఎదిగాడు. ఇంతై.. ఇంతింతై.. అన్నట్టు ఎదుగుతున్నా.. తండ్రి గర్వించే స్థాయిలో ఉన్నా ఎక్కడా మూలాల్ని మరువలేదు. అందుకు నిదర్శనం.. రీసెంట్ గా NDtv True legend future of young India అవార్డు స్వీకరించినప్పుడు చరణ్ మాటలే. ఇదంతా తండ్రి నుంచి నేర్చుకుంది, పాటిస్తోంది.. అంటూ చిరంజీవి గురించే చెప్పడం రామ్ చరణ్ ను ఉన్నతంగా నిలుపుతోంది.

ప్రపంచం గమనిస్తున్న వేళ..

రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం మెగా లెగసీతోపాటు తన క్రియేట్ చేసుకున్న ఓన్ ఇమేజ్ తో ముందుకెళ్తున్నారు. వేసే ప్రతి అడుగు ప్రపంచమంతా గమనిస్తున్న సమయంలో జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. మగధీర నుంచి ఆర్ఆర్ఆర్ వరకూ చరణ్ ఎదుగుదల చూసి రాజమౌళి (Rajamouli) మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. హాలీవుడ్ (Hollywood) దిగ్గజం జేమ్స్ కామెరూన్ సైతం రామ్ క్యారెక్టర్ ను అద్భుతంగా డ్రైవ్ చేశాడంటూ కితాబిచ్చాడు. ఇవన్నీ చిరంజీవి (Chiranjeevi) ని సంతోషంలో ముంచెత్తేవే. కానీ.. చరణ్ కు మోయలేనంత బరువు.. అంతకుమించి బాధ్యత. కానీ.. ఇవన్నీ తేలకగా చేసుకుని కేక్ వాక్ చేయడం రామ్ చరణ్ కు జన్మతః వచ్చినవే. ఎందుకంటే ఆయన చిరంజీవి కుమారుడు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...