Ram Charan: సినిమా హీరోలకు అభిమానులు ఉండటం సహజం. తమ అభిమాన హీరోను ఆరాధించే క్రమంలో సినిమా రిలీజ్ కు హంగామా చేస్తారు.. కటౌట్లకు పాలాభిషేకాలు.. పోస్టర్లకు దండలు వేస్తారు. ఇవన్నీ దాదాపుగా భారీ ఇమేజ్ ఉన్న హీరోల అభిమానులు చేసేవే. కానీ.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల తీరే వేరు. తమ హీరోను ఆరాధించటంలో ప్రత్యేక శైలి చూపిస్తారు. ఇదంతా కాస్త అతిశయోక్తిగా ఉన్నా నిజం. రామ్ చరణ్ సినిమా విడుదలకు ఎంత హాంగామా చేస్తారో ఆయన పుట్టినరోజుకు అదే హంగామా. కాకపోతే.. సేవా కార్యక్రమాలతో సరికొత్త ట్రెండ్ కు నాంది పలుకుతారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు ఇందుకు నిదర్శనం.
ఈ కార్యక్రమాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు రామ్ చరణ్ అభిమానులు. నిజానికి అభిమానులను ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రోత్సహించింది.. సినీ హీరో అభిమానులపై ప్రజల్లో ఉన్న అపోహలు పోగొట్టింది రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు ద్వారా రక్తదానం, నేత్రదానం కార్యక్రమాలకు రూపకల్పన చేసిన మొదటి భారతీయ హీరో. 27ఏళ్లుగా నిర్విరామంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చిరంజీవి అభిమానులు. ఇప్పుడు రామ్ చరణ్ పేరు మీదా చేస్తున్నారు. వీరే కాదు.. నవతరం రామ్ చరణ్ అభిమానులు కూడా ఇదే పంథా కొనసాగిస్తూ అభిమాన హీరో కోసం చేసే ఖర్చుతో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవన్నీ వారు స్వచ్చంధంగా ఏర్పాటు చేసుకోవడం విశేషం.
గేమ్ చేంజర్ విడుదలకు విజయవాడలో 256 అడుగుల భారీ కటౌట్ లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసారు అభిమానులు. దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయిస్తారు. రామ్ చరణ్ కూడా అభిమానులపై అంతే ప్రేమ చూపిస్తారు. ఫొటో షూట్లు ఏర్పాటు చేయించి వారితో ఫొటోలు దిగుతారు. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిఅభిమానుల మధ్య చిక్కుకున్నా కించిత్ అసహనం వ్యక్తం చేయలేదాయన. మనసు నిర్మలం, వ్యక్తిత్వం సున్నితం, ఆలోచన ప్రశాంతం. గేమ్ చేంజర్ ప్రీ-రిలీజ్ కు హాజరై తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై ఇద్దరు అభిమానులు దుర్మరణం చెందటం ఆయన్ను కలచివేసింది. వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించి ఆర్థిక సాయం అందించారు. అనంతరం మరిన్ని కార్యక్రమాల షెడ్యూల్ ఉన్నా రద్దు చేసారు. అందుకే.. రామ్ చరణ్ అభిమానులు చెప్పే మాట ‘నా హీరో రామ్ చరణ్’ అని.