గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డేకి రెండు గిఫ్ట్ లు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాలో చాలా బిజీగా ఉంటున్నాడు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కీలక నటులు అందరూ పాల్గొంటున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, జాన్వీకపూర్, జగపతి బాబు, శివరాజ్ కుమార్ లాంటి కీలక నటులు అందరూ వరుసగా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీకి ఇంకా టైటిల్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే ఉంది. ఆ రోజున ఈ మూవీ టైటిల్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
చూస్తుంటే ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. వచ్చే సంక్రాంతికి ఇప్పటి వరకు ఏ పెద్ద సినిమా డేట్ టాక్ చేయలేదు. కాబట్టి ముందే కర్చీఫ్ వేసేస్తే ఈ సినిమాకు పెద్ద సినిమాలు పోటీ రాకపోవచ్చు. పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దీంతో పాటే సుకుమార్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేయబోతున్నారంట. ఆ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ ఇస్తూ పోస్టర్ ను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
మొత్తానికి చరణ్ బర్త్ డే రోజున గురు, శిష్యులతో చేసే సినిమాల పోస్టర్లు రాబోతున్నాయి. రెండు సినిమాలపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. పైగా హిట్ గ్యారెంటీ సినిమాలు అనే టాక్ నడుస్తోంది. మరి చరణ్ బర్త్ డే రోజు ఎలాంటి సర్ ప్రైజ్ లు ఉంటాయో చూడాలి.