Ram Charan: మెగాపవర్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో గ్రాండ్ సెలబ్రేషన్స్ కు అభిమానులు సమాయాత్తమవుతున్నారు. ఇప్పటికే డీపీలు, వీడియోలు, గ్లింప్స్ రూపంలో మార్చి 27 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి.. ప్రతి ఏటా రామ్ చరణ్ పుట్టినరోజుకు 100 రోజుల కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే.. 50రోజుల ముందు ప్రణాళికలు సిద్ధమైపోతాయి. మార్చి 27కు ముందు 10 రోజుల నుంచీ ఇక రామ్ చరణ్ సందడే. అభిమానుల్లో ఆయన చూపిన ఇంపాక్ట్ కి ఇది నిదర్శనం.
రామ్ చరణ్ ను చూడగానే జై చరణ్.. జై జై చరణ్ నినాదాలు రావడం సహజం. కానీ.. ఇప్పుడు రామ్ చరణ్ సరికొత్తగా ఆవిష్కరించుకున్నాడు , ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ అని హాలీవుడ్ మీడియా కీర్తించాయి. భారతదేశంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ‘గ్లోబల్ స్టార్’ గా కొనియాడారు. అమెరికాలో తన హుందాతనంతో ప్రభావం చూపిన రామ్ చరణ్ ఈ పిలుపులకు నిజమైన అర్హుడు. దీంతో జై చరణ్ కంటే మిన్నగా గ్లోబల్ స్టార్ నినాదాలు హోరెత్తిపోతున్నాయి. మెగాస్టార్ అంటే చిరంజీవిలా.. గ్లోబల్ స్టార్ అంటే రామ్ చరణ్ అనేంతగా రామ్ చరణ్ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు.
దీంతో ఈ పుట్టినరోజును అభిమానులు చాలా గ్రాండ్ వేలో సెలబ్రేట్ చేయబోతున్నారు. బర్త్ డేకు ఇంకా వారం ఉన్నా.. రాజమండ్రిలో నేడు రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయి ఇవన్నీ రామ్ చరణ్ పై అభిమానుల ప్రేమ ఎలాంటిదో నిరూపిస్తున్నాయి. దీంతోపాటు ఈనెల 25,26, 27 తేదీల్లో ఆరెంజ్ సినిమా ప్రత్యేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. మార్చి 26న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో సాయంత్రం 4:32 నుంచి రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపేందుకు నిర్ణయించారు. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ గా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిన వేళ అభిమానుల ఆనందోత్సాహాలు ఈ రేంజ్ లో జరగడం సముచితమే.
Let the Celebration begin in a style
Mega Power Cults Get Ready to celebrate our IDOL 𝐆𝐋𝐎𝐁𝐀𝐋 𝐒𝐓𝐀𝐑 𝐑𝐀𝐌 𝐂𝐇𝐀𝐑𝐀𝐍 garu's Birthday in a Massive Way!Star Studded MegaEvent on 26th March at Shilpakalavedhika,HYD frm 4️⃣:3️⃣2️⃣ PM Onwards#ManOfMassesBdayMonth#JaiCHARAN pic.twitter.com/qqayQiRT21
— RC YuvaShakthi (@RcYuvaShakthi) March 19, 2023