Ram Charan: రామ్ చరణ్ నటను ఎవరో ప్రశంసించాలా..? వ్యక్తిత్వమే ఆయన విజయం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,254FansLike
57,764FollowersFollow

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అన్ని ఏరియాల్లో ప్రేక్షకాదరణ పొంది మంచి వసూళ్లు నమోదు చేస్తోంది. సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులే కాదు, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. రామ్ చరణ్ కెరీర్లో మరో ఉత్తమమైన సినిమాగా ‘పెద్ది’ నిలుస్తోంది. అయితే.. సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ఎంతలా వార్తల్లో నిలిచిందో.. మరో అంశంలో కూడా అంతే వార్తల్లో నిలుస్తోంది. ఏ తెలుగు సెలబ్రిటీ కూడా రామ్ చరణ్ నటనను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ వేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

దీనిపై అభిమానుల అభిప్రాయంలో.. మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ ఎప్పడూ అజాతశత్రువే. తన పని తాను చేసుకెళ్లే హీరోల్లో ఒకరు. అందరికీ భిన్నంగా.. చేసే పనిపైనే దృష్టిపెట్టే వ్యక్తిత్వం కూడా. రెండో సినిమా మగధీరతోనే అద్భుతాలు చేసినా, రంగస్థలంతో నటనకు కొత్త అర్ధం చెప్పినా.. ఆర్ఆర్ఆర్ తో పాత్రలో వేరియేషన్లతో మెప్పించినా తనకే చెల్లింది. ఎవరో తనను ప్రశంసించాలి.. సెలబ్రిటీలు తన సినిమా చూశారా.. అనే స్టేజ్ లో రామ్ చరణ్ లేరనేది నిర్వివాదాంశం. తన నటనతో ఎప్పుడో ఆ స్థితిని దాటిపోయారు. ఒకరు ప్రశంసిస్తేనే తన నటనకు గుర్తింపు అనేది రామ్ చరణ్ కు వర్తించేది కాదని ఫ్యాన్స్ అంటున్నారు.

తమ ప్రతిభను నలుగురూ గుర్తించాలని.. ఇలా ఒకరితో ప్రశంసలు అందుకోవడం మిగిలిన హీరోలకు, దర్శకులకు ఉంటుందే కానీ తమ హీరోకి కాదంటున్నారు. అభిమానుల అభిప్రాయమూ నిజమే. చేసిన 16 సినిమాల్లో పాత్ బ్రేకింగ్ అనదగ్గవి నాలుగు సినిమాలతో కెరీర్లో నిలిచిపోయే సినిమాలు చేసి.. కథలో పాత్రగా తెరపై కనిపించే నటుడనే పేరు రామ్ చరణ్ సంపాదించుకున్నాడు. ఏ నటుడికైనా కావల్సింది ఇదే. నటనలో పరకాయప్రవేశం చేసే నటులు తమిళ, మలయాళ హీరోలు అనుకునే తెలుగువారికి తెలుగులోనే అంతకుమించి నటనా సామర్ధ్యం ఉన్న నటుడిగా నేను రామ్ చరణ్ నిలిచాడు. ఇది కాదా ఓ హీరోకు నిజమైన గుర్తింపు. ఇదే కదా.. రామ్ చరణ్ ను మిగిలిన హీరోలకు భిన్నంగా చూపేది.

సినిమా

‘డ్యూ డేట్’ ఘనంగా ప్రారంభం.. కోర్ట్‌రూమ్ డ్రామాపై ఆసక్తి

తెలుగు సినీ పరిశ్రమలో పీఆర్‌ఓగా, జర్నలిస్ట్‌గా సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ నిర్మిస్తున్న తొలి చిత్రం 'డ్యూ డేట్' ఘనంగా ప్రారంభమైంది. పవన్ తరిగోపులతో...

PM Modi: ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్ హోతా హై’...

PM Modi: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా కాజోల్, రాణీ ముఖర్జీ జంటగా 1998లో వచ్చిన ‘కుచ్ కుచ్ హోతాహై’ సినిమాను సినీ...

ఫౌజీ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్.. ఆగస్టులో మేకింగ్ వీడియో!

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'ఫౌజీ' నుంచి అభిమానులకు త్వరలో ఓ ప్రత్యేక సర్‌ప్రైజ్ రానుంది. ప్రైమ్ ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రకారం,...

‘లెనిన్’లో చివరి 20 నిమిషాలే హైలైటా? శివాజీ పాత్రపై ఆసక్తి

అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమాపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో చివరి 20 నిమిషాలు...

‘మా ఇంటి బంగారం’కు రూ.100 కోట్ల మైలురాయి.. హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం, ఈ చిత్రం రానున్న ఆదివారం...

రాజకీయం

ఏపీలో హ్వాసంగ్ మెగా క్లస్టర్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియాలోని బుసాన్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, ప్రముఖ హ్వాసంగ్ గ్రూప్ (Hwaseung Group) ఉన్నతస్థాయి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఫుట్‌వేర్, ఫుట్‌వేర్ మెటీరియల్స్, ఆటోమోటివ్...

నల్లమలలో బయటపడిన అమరావతి చరిత్ర.. పవన్ కళ్యాణ్ హర్షం

నల్లమల అటవీ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఓ చారిత్రక శాసనం అమరావతి చరిత్రపై కొత్త వెలుగులు నింపింది. రాష్ట్ర అటవీశాఖ సహకారంతో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) చేపట్టిన సర్వేలో ఈ...

ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తాం: నాదెండ్ల మనోహర్

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన...

ఎల్జీ కెమ్‌తో లోకేష్ భేటీ.. ఏపీకి భారీ పెట్రోకెమికల్ పెట్టుబడులపై చర్చ

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సియోల్‌లో ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ...

ప్రతి హస్తకళకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తాం: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలోనే...

ఎక్కువ చదివినవి

Chiranjeevi-Rajinikanth: ‘బాక్సాఫీస్ టైటన్స్..’ మరోసారి ‘చిరంజీవి-రజినీకాంత్’ క్లాష్

Chiranjeevi-Rajinikanth: సినిమాలకెప్పుడూ మంచి సీజన్ రిలీజ్ అవసరం. అన్ సీజన్లో రిలీజై వండర్స్ క్రియేట్ చేసిన సినిమాలూ ఉన్నాయి. కానీ, సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి, క్రిస్మస్.. ఇలా పండగ సీజన్లలో సెలవులు...

Daily Horoscope: కర్కాటకం వారికి శుభవార్తలు.. ధనుస్సు వారికి కొత్త అవకాశాలు

జులై 2 , 2026 గురువారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ఆధారంగా జులై 2, 2026 గురువారం నాటి రాశిఫలాలు ఇవి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం, విద్య మరియు...

తెలుగు సినిమాకు కావాల్సింది రికవరీ మోడల్ కాదు.. నమ్మకం గెలిచే బిజినెస్ మోడల్

ఒకప్పుడు సినిమా పూర్తయిన తర్వాత నిర్మాతలు, దర్శకులు, అభిమానులు ఎదురుచూసేది ఒక్కటే... "సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది?" అనే ప్రశ్న. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి...

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

DAILY HOROSCOPE: కన్య రాశికి ఉద్యోగ అవకాశాలు.. ధనుస్సు రాశికి ప్రయాణాల్లో శుభవార్తలు

జులై 5 , 2026 ఆదివారం రాశిఫలాలు ఈరోజు చంద్ర మాన పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ దైనందిన జీవితానికి మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం...