బిగ్ బాస్ షోకు తెలుగు నాట ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ షోను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానిస్తున్నారు. ఇక ప్రస్తుతం సీజన్-8 నడుస్తోంది. మరీ అంత కాకపోయినా పర్వాలేదు అన్నట్టుగానే నడుస్తోంది. ఈ సారి ఎక్కువగా టీవీ యాక్టర్లు ఉన్నారు. ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. హౌజ్ లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. ఇందులో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. మిగతా ఐదుగురు ఫైనల్ స్టేజ్ కు వెళ్లబోతున్నారు. దాంతో ఈ సారి ఎవరు చీఫ్ గెస్ట్ గా వచ్చి ప్రైజ్ ఇస్తారా అని అంతా వెయిట్ చేస్తున్నారు.
గతంలో చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చి ప్రైజ్ మనీ ఇస్తున్నాడు. కానీ ఈ సారి మాత్రం పాన్ ఇండియా స్టార్ ను రంగంలోకి దించబోతున్నారంట. తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా స్థాయికి వెళ్లింది కాబట్టి బిగ్ బాస్ కు క్రేజ్ పెంచేందుకు పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ను రంగంలోకి దించుతున్నారంట. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ట్రెండింగ్ లో ఉన్నాడు. ఇప్పటికే నార్త్ లో ప్రమోషన్లు చేశారు. మూవీపై మంచి హైప్ ఉంది. కాబట్టి రామ్ చరణ్ ను చీఫ్ గెస్ట్ గా రప్పిస్తే బిగ్ బాస్ కు క్రేజ్ పెరగడంతో పాటు గేమ్ ఛేంజర్ మూవీకి కూడా హైప్ వస్తుందని ఆలోచిస్తున్నారంట.
ఇప్పటికే రామ్ చరణ్ తో చర్చలు జరుపుతున్నారంట. తండ్రి స్థానంలో రామ్ చరణ్ ఈ సారి వస్తే ఇండస్ట్రీలో కూడా పాజిటివ్ టాక్ వస్తుందని ఆశిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.