గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోకు వచ్చాడు. బాలయ్య హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షో సీజన్-4కు తాజాగా రామ్ చరణ్ వచ్చాడు. ఇందులో భాగంగా బాలయ్య చాలా ప్రశ్నలను అడిగాడు. రామ్ చరణ్ బాల్యం దగ్గరి నుంచి అతని కూతురు దాకా అన్ని విషయాలను బయట పెట్టించాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మొదటి పార్టు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకో పార్టుకు సంబంధించి పండగలాంటి ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
ఇందులో రామ్ చరణ్ యాక్టింగ్ నేర్చుకుంటున్న వీడియో గురించి చూపించారు. అలాగే మీ అక్క అంటే ఇష్టమా లేదంటే చెల్లెలు అంటే ఇష్టమా అని బాలయ్య అడగ్గా.. తన అక్క ఊరుకోదు కాబట్టి అక్క అంటే ఇష్టం అన్నాడు. దాంతో షోలో నవ్వులు పూశాయి. నువ్వు నెపో కిడ్ నేను కూడా నెపో కిడ్. మన మీద చాలా ప్రెషర్ ఉంటుంది కదా.. నీకు అలా ఏమైనా అనిపించిందా.. ఇండస్ట్రీలో ఒకవేళ సక్సెస్ కాకపోయి ఉంటే ఏం చేసేవాడివి అని బాలయ్య ప్రశ్నించాడు. దానికి రామ్ చరణ్ స్పందిస్తూ కొన్ని విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ వీడియోను మ్యూట్ చేశారు. ఇక చివరగా చావైనా, బతుకైనా ఇండస్ట్రీలోనే ఉంటాను అంటూ తెలిపాడు రామ్ చరణ్.
దాంతో షోలో చప్పట్ల మోత మోగింది. రెండో పార్టును త్వరలోనే విడుదల చేసేందుకు అన్ స్టాపబుల్ టీమ్ రెడీ అవుతోంది. ఇక ఫస్ట్ పార్టులో రామ్ చరణ్ చాలా విషయాలు చెప్పడంతో అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.