Ram Charan: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ (Ram Charan) తెలుగులోనే కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా నిలుస్తున్నారు. సహజంగానే అంతటి స్టార్ పై ఫోకస్ ఎక్కువగానే ఉంటుంది. ఈక్రమంలోనే ఆయన ఆస్తుల విలువ రూ.1370కోట్లని అంచనా. సినిమా రెమ్యునరేషన్, బ్రాండ్స్, పెట్టుబడులు, వ్యాపారం, స్థిర చరాస్తుల విలువ మొత్తంగా లెక్కిస్తున్నారు.
సినిమాకు 45-100కోట్ల మధ్య రెమ్యునరేషన్ మాత్రమే కాదు.. ఫ్రూటీ, హీరో, పెప్సీ, ఫ్రూటీ, డిస్నీ హాట్ స్టార్, హ్యాపీ, అపోలో జియా, మాన్యవర్.. తదితర 34 బ్రాండ్స్ ను ఇప్పటివరకూ ప్రమోట్ చేశారు. వ్యక్తిగత పెట్టుబడులే 150కోట్లుగా ఉంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీకి కూడా ఆయనదే. ట్రూజెట్ లో కూడా పెట్టుబడులు పెట్టారు. ఓ ప్రైవేట్ జెట్ కు ఓనర్ అయిన రామ్ చరణ్ కు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఫెరారీ, ఆస్టన్ మార్టిన్, బెంజ్, రోల్స్ రాయ్స్ కార్లు రామ్ చరణ్ కు ఉన్నాయి.