Double iSmart : ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొంది గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వీరి కాంబోలో మరో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు వీరి కాంబోలో డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ రూపొందింది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డబుల్ ఇస్మార్ట్ మూవీకి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పాన్ ఇండియా రేంజ్ లో డబుల్ ఇస్మార్ట్ మూవీకి ఏకంగా రూ.50+ కోట్లకు పైగా బిజినెస్ అయ్యిందట.
రామ్ మరియు పూరి జగన్నాద్ లు ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించడం లో విఫలం అయ్యాయి. అందుకే వీరి కాంబో మూవీకి రూ.50 కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ అవ్వడం అనేది చాలా భారం. బయ్యర్లు సేఫ్ జోన్ లోకి రావడానికి కనీసం రూ.60 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ఆ స్థాయి వసూళ్లు నమోదు చేస్తుందా అనేది చర్చనీయాంశం.
రామ్ కి జోడీగా ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ నటించడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.