ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ మహేష్ బాబు.పి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్య శ్రీ బోర్స్ రామ్ 22 సినిమాలో ఛాన్స్ అందుకుంది. సినిమాలో రామ్, భాగ్య శ్రీ లవ్ ట్రాక్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.
రామ్ 22వ సినిమాకు ఆంధ్రా కింగ్ తాలూకా టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా రాజమండ్రిలో సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 34 రోజుల నిరతరాయంగా ఈ సినిమా షూటింగ్ నిర్వహించారు. ఈ షెడ్యూల్ లో సినిమా మేజర్ పార్ట్ పూర్తైనట్టు తెలుస్తుంది.
మళ్లీ ఈ నెల 28 నుంచి హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. డబుల్ ఇస్మార్ట్ సినిమా నిరాశపరచడంతో రామ్ ఈ సినిమా మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడు. సినిమాలో సాగర్ పాత్రలో యంగ్ లుక్స్ తో రామ్ అదరగొట్టేస్తాడని అంటున్నారు. ఈ సినిమాకు వివేక్ అండ్ మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు.