రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్ తో హీటెక్కిస్తోంది. పెళ్లి అయినా సరే.. వయసు పెరుగుతున్నా సరే తన అందం ఏ మాత్రం తగ్గట్లేదని నిరూపించుకుంటోంది ఈ భామ.
నార్త్ బ్యూటీ అయినా కూడా తెలుగు సినిమాతోనే ఆమెకు ఫేమ్ వచ్చింది. చిన్న సినిమాలతో మొదలు పెట్టి చాలా త్వరగానే లక్కీ హీరోయిన్ అనే ముద్ర వేసుకుంది. అందుకే తెలుగునాట చాలా త్వరగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. దెబ్బకు అటు తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
దాదాపు పదేళ్ల పాటు తెలుగులో సినిమాలు చేసింది. ఇక్కడే ఉంటే ఇంకా అవకాశాలు బోలెడన్ని వచ్చేవి. కానీ మధ్యలోనే బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడే జాకీ భగ్నానీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అక్కడే సినిమాలు చేసుకుంటోంది ఈ భామ. ఇక పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది.
అదే సమయంలో తన అందాలను అస్సలు దాచుకోకుండా పిచ్చెక్కిస్తూనే ఉంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో ఆమె టాప్ అందాలను అస్సలు దాచుకోకుండా చూపించేసింది. ఇందులో ఆమె హాట్ హాట్ గా మెరిసిపోతోంది.