Switch to English

రక్షిత్ శెట్టి ‘అతడే శ్రీమన్నారాయణ’ మూవీ రివ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

నటీనటులు: రక్షిత్ శెట్టి, శాన్వి శ్రీవస్తవ
నిర్మాత:  ప్రకాష్ – పుష్కర మల్లికార్జున్
దర్శకత్వం: సచిన్ రవి
సినిమాటోగ్రఫీ:  కర్మ్  చావ్లా
మ్యూజిక్: చరణ్ రాజ్ – బి. అంజనీష్ లోక్ నాథ్
ఎడిటర్‌: సచిన్ రవి
విడుదల తేదీ: జనవరి 1, 2020

‘కిర్క్ పార్టీ’ తో కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ర‌క్షిత్ శెట్టి హీరోగా పుష్క‌ర్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై పుష్క‌ర్ మ‌ల్లిఖార్జున‌, హెచ్‌.కె.ప్ర‌కాశ్ నిర్మించిన చిత్రం `అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌`. స‌చిన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతూ చేసిన ఈ మూవీని క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ ప్లాం చేశారు. డిసెంబర్ 27న కన్నడలో రిలీజై విజయం అందుకున్న ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు విడుదల చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ: 

అనగనగా కొన్ని సంవత్సరాల క్రితం.. అమరావతి ప్రాంతంలో అధీరులు అనే ఒక దొంగల తెగకి చెందిన వారికి అధినేత రామరాజు(మధు సూధన్).. వీరు ఒక నిధిపైన కన్నేశారు అంటే అది వారే దొంగిలించాలి అలా కాదని ఎవరు దొంగిలించిన చంపేస్తారు. అలా వారు కన్నేసిన ప్రభుత్వ నిధిని అమరావతికి వచ్చిన ఓ నాటక మండలిలోని కొందరు దొంగతనం చేస్తారు. దానిని వేరే చోట దాచేస్తారు. రామరాజు వారిని చంపినా నిధి వివరాలు తెలియవు. రామ రాజు తదనంతరం తన వారసులు కూడా ఆ నిధి వేటలో 15 ఏళ్ళు గడిచిపోతాయి, కానీ నిధిని కనిపెట్టలేరు. అప్పుడే ఆ ఏరియా ఇన్స్పెక్టర్ అయిన శ్రీమన్నారాయణ(రక్షిత్ శెట్టి) అనుకోకుండా చేసిన ఓ తప్పు వలన అధీరుల కోసం ఆ ట్రెజర్ చేధించాల్సి వస్తుంది. శ్రీమన్నారాయణ ఎవరు? ఎందుకు అధీరుల ట్రాప్ లో ఇరుక్కున్నాడు? చివరికి నిధిని చేధించాడా? లేదా? 15 ఏళ్ళు వాళ్ళు కనుక్కోలేనిది శ్రీమన్నారాయణ ఎలా కనుక్కున్నాడు? ఆ నిధికి – అధీరులకి – శ్రీమన్నారాయణకి ఉన్న సంబంధం ఏమిటి? అనేదే కథ..

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

రక్షిత్ శెట్టి పెర్ఫార్మన్స్ అదరహో అని చెప్పుకోవాలి. తన పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని చాలా సీన్స్ లో కట్టి పడేస్తాడు. చాలా తెలివైన వాడు, అవసరాన్ని బట్టి ఎటైనా జంప్ అయ్యే పాత్రలో హావభావాలు అద్భుతంగా పలికించాడు. ‘పైరేట్స్ అఫ్ ది కరేబియన్’ సినిమాలోని జాక్ స్పారో(జానీ డీప్) పాత్ర స్పూర్తితో రక్షిత్ శెట్టి పాత్రని డైజిన్ చేశారు. అందుకే ఆ పాత్రకి చాలా అంటే చాలా దగ్గరా ఉంటుంది. శాన్వి స్క్రీన్ టైం తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో బాగా చేసింది. మెయిన్ విలన్ గా చేసిన బాలాజీ మోహనన్ పెర్ఫార్మన్స్ అదరగొట్టాడు. చాలా సీన్స్ లో అందరికీ భయం కలిగించే రేంజ్ లో నటించాడు. సాఫ్ట్ కోర్ విలన్ గా ప్రమోద్ శెట్టి బాగా చేశారు. మధుసూదన్ రావు చేసింది ఒకటే సీన్ అయినా మస్త్ చేసాడు. మిగిలిన నటీనటులు వారి వారి పాత్రలకి న్యాయం చేశారు.

సినిమా పరంగా చూసుకుంటే.. సినిమా మొదలు పెట్టిన విధానం, పాత్రలని పరిచయం చేసిన తీరు, హీరో ఇంట్రడక్షన్ సీన్ అన్నీ అదిరిపోయాయి. ఫస్ట్ హాఫ్ మొదటి 40 నిమిషాలు సూపర్బ్ అనిపిస్తది. అలాగే ఇంటర్వల్ బ్లాక్, సెకండాఫ్ మొదటి 15 నిమిషాలు, నిధి కోసం హీరో సాల్వ్ చేసే పజిల్స్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ బాగున్నాయి.

ఆఫ్ స్క్రీన్:  

రక్షిత్ శెట్టి అండ్ టీం ఓ ట్రెజర్ హంట్ మూవీ చెయ్యాలని ఎంచుకున్న లైన్, బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది. అందులోనూ ముఖ్యంగా మన పురాణాల్లోని ‘సాగర మధనం’ అనే ఘట్టాన్ని వాడుకొని రాసుకున్న నిధి అన్వేషణ ప్రక్రియ హైలైట్. ముఖ్యంగా ప్రతి పాత్రని పురాణాల్లోని పాత్రలతో పోల్చి రాక్షస రాజ్యం పై గెలుపెప్పుడు నారాయణుడిదే అని చెప్పడం బాగుంది. ఇక కర్మ్ చావ్లా సినిమాటోగ్రఫీ ఓ అద్భుతమైన విజువల్ వండర్ అనచ్చు. వింటేజ్ ఫీల్ ని ఒక్క ఫ్రేమ్ లో కూడా మిస్ కాకుండా చూపిన విధానం సింప్లీ సూపర్బ్. చరణ్ రాజ్ – బి. అంజనీష్ లోక్ నాథ్ సాంగ్స్ బాగున్నాయి. అందులో ముఖ్యంగా అంజనీష్ లోక్ నాథ్ అందించిన నేపధ్య సంగీతం సినిమాని చాలా చోట్ల నిలబెట్టింది. కొన్ని సీన్స్ లో ఆడియన్స్ కి హై ఫీల్ ఇస్తుంది. సౌండ్ డిజైనింగ్ కూడా వండర్ఫుల్ అని చెప్పాలి. ఎడిటింగ్ టెక్నిక్ అదుర్స్. ఆర్ట్ వర్క్ అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా ఆటోప్ లెవల్లో ఉన్నాయి.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ కి సినిమా ఆధ్యంతం ఎంగేజింగ్ గా ఉండాలి.. అలా లేకపోతే బోర్ ఫీలవుతారు, బయటకి వెళ్లి దమ్మేస్తారు.. అలాంటి లాగింగ్ సీన్స్ ఇందులో చాలానే ఉన్నాయి. మొదటి 40 నిమిషాల తర్వాత సినిమా చాలా స్లో అవుతుంది. అలాగే సెకండాఫ్ లో అక్కడక్కడా కొన్ని మోమెంట్స్ భలే ఉన్నాయి అనిపించినా ఎక్కువ భాగం ఏంటీ సాగదీత త్వరగా ఫినిష్ చేసేయండి అనే ఫీలింగ్ కలుగ జేస్తుంది. మరో బిగ్గెస్ట్ మైనస్ సినిమా లెంగ్త్, 3 గంటలా 6 నిమిషాలు.. బాగుంటే ఓకే, బోరింగ్ ఎక్కువ అవ్వడం వలన ఆడియన్స్ కి పొద్దునెప్పుడో వచ్చాం రాత్రవుతుంది మమ్మల్ని వదిలేయండి అని ఫీలవుతారు. ట్రెజర్ ట్రెజర్ అని చెప్పి ఎగ్జైట్ అయ్యేలా చేసి ఆ నిధి అన్వేషణని సప్పగా ఏం కిక్ లేకుండా చెప్పడం వలన సెకండాఫ్ చాలా వరకూ డిస్కనెక్ట్ అయిపోతుంది.

ఆఫ్ స్క్రీన్:  

రక్షిత్ శెట్టి ఎంచుకున్న స్టోరీ పాయింట్ బాగున్నా పూర్తి కథగా బెటర్ గా చేయలేదు. ముఖ్యంగా ట్రెజర్ హంట్ సినిమా అని ఆడియన్స్ ని కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు నిధి అన్వేషణ, అందులో వచ్చే సమస్యలు, అవీ ఇవీ అని భారీగా ఆశిస్తారు. కానీ 3 గంటలపాటు నిధి కోసమే జరిగే ఈ కథలో నిధి అన్వేషణ ఆసక్తిగా లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్. ఇక స్క్రీన్ ప్లే కూడా చాలా బోరింగ్ గానే రాసుకున్నారు. నేరేషన్ చాలా అంటే చాలా స్లో.. కొన్ని సింపుల్ గా చెప్పేయచ్చు అలా వదిలేసి సాగదీసి మరీ విడమరిచి చెప్పడం సాగదీతకి మెయిన్ రీజన్. ఈ సినిమాని 186 నిమిషాల్లో కాకుండా 126 నిమిషాల్లో చెప్పుంటే అందరినోటా ఫెంటాస్టిక్ అనిపించుకునేది. కానీ ఒక గంట ఎక్స్ట్రా లెంగ్త్ అనేది సినిమాని బిలో యావరేజ్ చేసేసింది.

డైరెక్టర్ గా సచిన్ రవి విజువలైజేషన్, మేకింగ్ అదిరింది. కానీ ఆధ్యంతం ప్రేక్షకులని కదలకుండా కూర్చోబెట్టి సినిమా చూపించగలిగాడా అనే లేదనే చెప్పాలి. చాలా చోట్ల బోర్ కొడుతోంది. సచిన్ ఎడిటర్ కూడా కాబట్టి కాస్త లెంగ్త్ విషయంలో కేర్ తీస్కొని ఉండాల్సింది.

విశ్లేషణ: 

‘కెజిఎఫ్’ తర్వాత కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ యంగ్ టీం నుంచి వచ్చిన టెక్నికల్ మాస్టర్ పీస్ ఫిల్మ్ ‘ అతడే శ్రీమన్నారాయణ’. సినిమాగా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించలేకపోయినా టెక్నికల్ గా మాత్రం ఇండియన్ బెస్ట్ మేకింగ్ మూవీస్ లిస్ట్ లో చేరుతుంది. రక్షిత్ శెట్టి స్టోరీ లైన్, ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్, ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ లోని కొన్ని మోమెంట్స్ తో ఆకట్టుకుంటే స్లో నేరేషన్, బోరింగ్ సీన్స్, ఎంటర్ టైన్మెంట్ లేకపోవడం లాంటివి ప్రేక్షకులని డిజప్పాయింట్ చేస్తాయి. కొత్త సంవత్సరంలో సరికొత్త సినిమాలు చూడాలనుకునే అందరూ చూడదగిన సినిమా ”అతడే శ్రీమన్నారాయణ”.

ఫైనల్ పంచ్: అతడే శ్రీమన్నారాయణ – మాస్టర్ పీస్ మేకింగ్, బోరింగ్ నేరేషన్.!

తెలుగుబుల్లెటిన్.కామ్ రేటింగ్: 2.5/5 

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...
నటీనటులు: రక్షిత్ శెట్టి, శాన్వి శ్రీవస్తవ నిర్మాత:  ప్రకాష్ - పుష్కర మల్లికార్జున్ దర్శకత్వం: సచిన్ రవి సినిమాటోగ్రఫీ:  కర్మ్  చావ్లా మ్యూజిక్: చరణ్ రాజ్ - బి. అంజనీష్ లోక్ నాథ్ ఎడిటర్‌: సచిన్ రవి విడుదల తేదీ: జనవరి 1, 2020 'కిర్క్ పార్టీ' తో కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ర‌క్షిత్ శెట్టి హీరోగా పుష్క‌ర్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై పుష్క‌ర్ మ‌ల్లిఖార్జున‌, హెచ్‌.కె.ప్ర‌కాశ్ నిర్మించిన చిత్రం `అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌`. స‌చిన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతూ...రక్షిత్ శెట్టి 'అతడే శ్రీమన్నారాయణ' మూవీ రివ్యూ