Switch to English

వైసీపీలో ‘రాజ్యసభ’ కుదుపు: మళ్ళీ పదవులు వాళ్ళకేనా.?

మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అతి త్వరలో. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ కూడా రావడంతో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ‘చిన్నపాటి సునామీ’ తలెత్తినట్లే ప్రచారం జరుగుతోంది. ఆశావహులు ఎక్కువ.. అవకాశాలు తక్కువ.. అన్నప్పుడు పరిస్థితి ఇలాగే వుంటుంది మరి. ప్రస్తుతం వైసీపీ నుంచి ఇద్దరు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

తాజాగా, మరో నలుగురికి అవకాశం దక్కనుంది. అయితే, ఆశావహుల లిస్ట్‌ చాంతాడంత వుంది. నాలుగు స్థానాలు, నలభై మందికి పైగా ఆశావహులు.. అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. నలభయ్‌ కాదు.. ఇంకా ఎక్కువేనన్న చర్చ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

శాసన మండలి రద్దు దిశగా ఇప్పటికే వైఎస్‌ జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో తీర్మానం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో, మండలిపై ఆశలు పెట్టుకున్నవారంతా, ఇప్పుడు రాజ్యసభ డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. అలా ఆశావహుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయిందని చెప్పొచ్చు. జిల్లాల వారీగానే ముగ్గురు నుంచి నలుగురి వరకు ఆశావహులు వున్నారంటే, పరిస్థితి తీవ్రతని అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా వుంటే, ‘ఎవరికి రాజ్యసభ సీట్లు ఇవ్వాలో వైఎస్‌ జగన్‌కి బాగా తెలుసు. ఆయన ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారు..’ అంటూ వైసీపీ నుంచి లీకులు అందుతున్నాయి. మరోపక్క, రాజ్యసభ సీటు కోసం.. ఎంత పెద్ద మొత్తంలో అయినా ఖర్చు చేయడానికి ఆశావహులు వెనుకాడరు. ఇది గతంలోనే నిరూపితమయ్యింది.

ఈ నేపథ్యంలో, కనీ వినీ ఎరుగని స్థాయిలో ఇప్పుడు రాజ్యసభ సీటుకి ఆంధ్రప్రదేశ్‌లో డిమాండ్‌ పెరిగిందనడం అతిశయోక్తి కాదేమో. పదవులు తక్కువ.. ఆశావహులు ఎక్కువ కావడంతో.. వైసీపీలో తలెత్తుతున్న ఈ అలజడి ముందు ముందు రాజకీయ సునామీగా మారబోతోందని వైసీపీ నేతలే ఆఫ్‌ ది రికార్డ్‌గా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవులు పొందినవారు.. ప్రత్యేక కారణాలతో రాజ్యసభకు అర్హత సాధించబోతున్నారన్న చర్చ నేపథ్యంలో ‘మళ్ళీ వాళ్ళకేనా పదవులు. ఇలాగైతే, పార్టీలో మేం వుండడం దండగ..‘ అని కొందరు నేతల పార్టీలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారట.

అన్నట్టు, వైసీపీకి దక్కే నాలుగు సీట్లలో ఓ రాజ్యసభ సీటు విషయమై బీజేపీ ఆశపడుతోంది. ‘వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు..’ అని కొందరు బీజేపీ నేతలు చెబుతున్నా.. ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలు వేరేలా వున్నాయి. అలా బీజేపీకి ఓ రాజ్యసభ సీటు ఇవ్వాల్సి వస్తే.. వైసీపీలో గందరగోళం మరింత తారాస్థాయికి చేరబోతోందన్నది నిర్వివాదాంశం.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

అబ్జర్వేషన్‌: సీఎం జగన్‌.. ఏడాది పాలనకి మార్కులెన్ని.?

సంచలన విజయానికి ఏడాది.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.. పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయ్యింది. మొత్తంగా 175 సీట్లు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి వుంటే, అందులో 151 సీట్లను వైఎస్‌ జగన్‌...

చంద్రబాబు: స్వపక్షాన్నీ కొనక తప్పదా?

ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీని తట్టుకుని మరో నాలుగేళ్లు ఎలా పోరాడాలా అని...

బన్నిలా నన్ను తప్ప వేరొకరిని ఊహించుకోలేనంటున్న బాలీవుడ్ హీరో.!

అల్లు అర్జున్ కెరీర్లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...