రాజుగారి మూడో గదిలో మిల్కీ బ్యూటీ ఏం చేస్తుందో!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,335FansLike
57,764FollowersFollow

రాజుగారి మొదటి గది.. అదేనండీ, ‘రాజు గారి గది’ సినిమా సూపర్‌ హిట్టయ్యింది. దాంతో, దర్శకుడు ఓంకార్‌ ఇంకో అడుగు ముందుకేసి, భారీ బడ్జెట్‌తో నాగార్జున, సమంత కాంబినేషన్‌లో రెండో ‘రాజు గారి గది’ తీశాడు. నాగార్జున స్టార్‌డమ్‌ కావొచ్చు, సమంత పాపులారిటీ కావొచ్చు.. ఈ రెండో గదిని ఆసక్తికరంగా మార్చలేకపోయాయి. సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో దర్శక నిర్మాత ఓంకార్‌ సైలెంటయిపోయాడు. మధ్యలో ఓ టెలివిజన్‌ షో చేసి, మళ్ళీ ఇప్పుడు మూడో గది షురూ చేశాడు.

ఈసారి మూడో గది కోసం మిల్కీ బ్యూటీ తమన్నాని తీసుకొస్తున్నాడు దర్శక నిర్మాత ఓంకార్‌. అశ్విన్‌బాబు హీరోగా రూపొందనుంది ఈ సినిమా. తొలి సినిమాలానే మూడో గది అదిరిపోతుందని చెబుతన్న ఓంకార్‌, ఈసారి మరింత జాగ్రత్తగా స్క్రిప్ట్‌ రెడీ చేశానని అంటున్నాడు. సినిమా ప్రారంభోత్సవం కాస్సేపటి క్రితం జరిగింది. తమన్నా ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

మరోపక్క, ఇటీవలి కాలంలో తమన్నా నటిస్తున్న సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి బాక్సాఫీస్‌ దగ్గర బొక్క బోర్లా పడిపోతున్న విషయం విదితమే. తెలుగులో కళ్యాణ్‌రామ్‌తో చేసిన ‘నా నువ్వే’ కావొచ్చు, ప్రభుదేవాతో కలిసి చేసిన తమిళ – తెలుగు సినిమా ‘అభినేత్రి’ కావొచ్చు.. దారుణంగా దెబ్బ తీనేశాయి. పైగా, ఈ మధ్య అన్నీ దెయ్యం సినిమాలే వస్తున్నాయి తమన్నాకి. ఈ పరిస్థితుల్లో తమన్నా నుంచి మరో దెయ్యాల సినిమాని ప్లాన్‌ చేసిన ఓంకార్‌, ఈసారేం చేస్తాడోనన్న చర్చ అంతటా జరుగుతోంది.

‘రాజు గారి గది’ సినిమాకి కామెడీ ప్లస్‌ అయ్యింది.. థ్రిల్లింగ్‌ ఎపిసోడ్స్‌ సంగతెలా వున్నా, సినిమాలో ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌ అయితే వుంది. కానీ, రెండో రాజు గారి గదిలో అవేమీ కన్పించలేదు. అయితే, రెండో రాజుగారి గదికి సంబంధించి చోటు చేసుకున్న పొరపాట్లను రిపీట్‌ కాకుండా పక్కా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట ఓంకార్‌. కథ చాలా బాగా వచ్చిందనీ, ‘రాజు గారి గది’ లానే, ‘రాజు గారి గది 3’ కూడా ట్రెండ్‌ సెట్టింగ్‌ అవుతుందనీ ఓంకార్‌ అంటున్నాడు.

10 COMMENTS

సినిమా

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే...

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.....

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన...

రాజకీయం

జనాభా తగ్గుదలపై అప్రమత్తమైన ఏపీ… ‘పాపులేషన్ కేర్’ కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి...

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ఎక్కువ చదివినవి

ప్రోటోకాల్ పక్కన పెట్టి బాధితుల వద్దకు చంద్రబాబు

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజయనగరం నుంచి నేరుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన విషయం తెలిసిన వెంటనే ఆయన పర్యటన...

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

Chiranjeevi: ‘50 రోజుల మన శంకరవరప్రసాద్ గారు’.. వండర్స్ ఎన్నో..

Chiranjeevi: ఓ సినిమా హిట్టయితే టీమ్ కి ఆనందం. నటీనటులకు సంతోషం. బయ్యర్లకు సంబరం. కానీ, ఓ సినిమా హిట్టయితే వీటన్నింటితోపాటు ఆ సినిమా హీరో అభిమానులకు పండగ.. ఎనలేని ఉత్సాహం. ఆనందభాష్పాలతో...

వేట్లపాలెం పేలుడు: నిబంధనల ఉల్లంఘనే కారణం – పవన్ కళ్యాణ్

సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద బాణసంచా తయారీ యూనిట్‌లో జరిగిన ఘోర పేలుడు ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా, 9 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు...

లీన్ లుక్ తర్వాతే ‘స్పిరిట్’ షూట్.. ప్రభాస్ ప్లాన్ ఇదే

పాన్ ఇండియా స్టార్ Prabhas నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ వెంటనే ప్రారంభం కానుందని భావించిన అభిమానులకు తాజా సమాచారం ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ పూర్తిగా లీన్ లుక్ సాధించిన తర్వాతే ‘స్పిరిట్’...