అనుమతి లేకుండా తన ఫొటోలు, మాటలను వినియోగించకూడదని తమిళ అగ్ర హీరో రజినీకాంత్ తన లాయర్ ద్వారా బహిరంగ హెచ్చరిక జారీ చేశారు.
’రజినీకాంత్ సూపర్ స్టార్ గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆయన ఓ సెలబ్రిటీ. అయితే.. ఆయన అనుమతి లేకుండా కొందరు తమ వ్యాపార ప్రకటనలకు, సోషల్ మీడియాలో రజినీకాంత్ ఫొటో, మాటలు, వీడియోలను ప్రచారంగా వాడుకుంటున్నారు. తద్వారా ప్రజలను మభ్యపెడుతూ వారు లబ్ది పొందుతున్నారు. ఈ చర్యల ద్వారా ఆయన ప్రతిష్టకు వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తున్నారు. ఇది ఎంతమాత్రం ఉపేక్షణీయం కాదు’.
‘సోషల్ మీడియాలో కూడా మీమ్స్, ట్రోల్స్ కు ఉపయోగిస్తున్నారు. ఇకపై రజినీకాంత్ అనుమతి లేకుండా ఆయనకు సంబంధించిన విషయాలు ఏవీ వాడేందుకు వీలు లేదు. ఇలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదు’ అని బహిరంగ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త తమిళనాడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
47591 923527Spot lets start on this write-up, I seriously believe this wonderful web site requirements a lot a lot more consideration. Ill far more likely once once again to read an excellent deal more, several thanks that info. 695914