మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం దేవర దసరాకు విడుదల కాబోతోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా అక్టోబర్ 10కి వస్తుందని అధికారికంగా వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు దేవరకు గట్టి పోటీనే వచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో టిజె జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా వెట్టయ్యాన్.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా కూడా దసరాకే విడుదల కానుందని సమాచారం. అక్టోబర్ 10కే ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.
రజినీ సినిమాతో పోటీ అంటే ఎన్టీఆర్ దేవరకు ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. పైగా దేవర ప్యాన్ ఇండియా వైడ్ గా విడుదలవుతోన్న చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో తప్పితే మిగతా చోట్ల సౌత్ లో రజినీకాంత్ డామినేషన్ ఉంటుంది మరి.