Switch to English

రాజస్థాన్ రగడ: పైలట్ దారెటు?

రాజస్థాన్ లో రాజకీయ రగడ మరింత ముదిరింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య కొనసాగుతున్న విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఇరువురూ తమ తమ బల ప్రదర్శనలు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పైలట్ చెబుతుండగా.. తమకు వందకు పైగా ఎమ్మెల్యేల బలం ఉందని గెహ్లాట్ వర్గం చెబుతోంది. వీరిలో 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగా, మరో పది మంది స్వతంత్రులు ఉన్నారని సమచారం.

రణ్ దీప్ చెప్పిందే నిజమైతే.. పైలట్ వెంట 30 మంది ఎమ్మెల్యేలు లేరని తెలుస్తోంది. సోమవారం గెహ్లాట్ ఇంట సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. దీనికి హాజరు కావాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విప్ కూడా జారీచేశారు. 200 మంది సభ్యుల గల రాజస్థాన్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 101. ప్రస్తుతం మిత్రపక్షాలు, స్వతంత్రులతో కలసి కాంగ్రెస్ కు 124 మంది ఉండగా.. బీజేపీ కూటమికి 76 మంది ఉన్నారు. పైలట్ చెప్పినట్టు ఆయనకు 30 మంది సభ్యుల బలం ఉండి, బీజేపీతో చేతులు కలిపితే గెహ్లాట్ సర్కారు కూలిపోవడం ఖాయం. కానీ ఆ పరిస్థితి రానివ్వబోమన్నది కాంగ్రెస్ ధీమాగా చెబుతున్న మాట.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పైలట్ తో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలంటే కనీసం 25 మంది సభ్యుల మద్దతు అదనంగా కావాలి. కానీ తాను బీజేపీతో కలిసి వెళ్లబోనని సచిన్ పైలట్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతండగా.. ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. సీఎం గెహ్లాట్ కు అత్యంత సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులపై సోమవారం పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు చేశారు. ఇదంతా బీజేపీ కుట్ర అని, తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ నేత రణ్ దీప్ సూర్జేవాలా ధ్వజమెత్తారు. మొత్తానికి అటు రాజకీయ నేతల పోటాపోటీ భేటీలు.. ఇటు ఐటీ దాడులు వెరసి రాజస్థాన్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఈ క్రమంలో అసలు సచిన్ పైలట్ దారి ఎటు అన్నది స్పష్టత లేదు. బీజేపీతో చేతులు కలిపేది లేదని చెప్పినందున.. పార్టీలో ఉంటూనే సీఎం పీఠం కోసం ప్రయత్నాలు చేస్తారా అన్నది తెలియాలంటే రెండు మూడు రోజులు వేచి చూడాల్సిందే.

సినిమా

ఎక్స్ క్లూజివ్: జాతీయ అవార్డు గ్రహీతతో రాజశేఖర్‌ మూవీ

సీనియర్‌ హీరో రాజశేఖర్‌ ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌ కు దూరంగా ఉంటున్నాడు. అయితే ఈ సమయంలో ఆయన మాత్రం వరుసగా స్క్రిప్ట్‌లు వింటున్నాడు. ఇప్పటికే...

సుశాంత్‌ డెత్‌ మిస్టరీ: ఈ కేసులో న్యాయం జరుగుతుందా.?

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ డెత్‌ మిస్టరీకి సంబంధించి నానా యాగీ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది. ముంబై - బీహార్‌...

క్లాసిక్ సీక్వెల్ లో కీర్తి సురేష్ ఫైనల్ అయినట్లేనా?

ఈ మధ్య కాలంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది కీర్తి సురేష్. మహానటి తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు....

రియా చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ

సుశాంత్‌ కుటుంబ సభ్యులు మరియు అభిమానులు కోరుకున్నట్లుగా జరిగింది. ఆయన మృతికి కారణం రియా అయ్యి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. మృతికి సంబంధించిన కేసును సీబీఐకి...

సుశాంత్ కేసును సీబీఐకు అప్పగించడం చట్టవిరుద్ధమంటూ రియా విమర్శలు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రోజూ వార్తల్లో నిలుస్తూ వస్తోన్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మళ్ళీ స్పందించింది. రీసెంట్ గా...

రాజకీయం

ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు..

ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపుపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్రం అంగీకరించడంతో ఆమె పదవీకాలం మరో మూడు నెలల పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వచ్చే...

‘బడి పిల్లలకు పుస్తకాల భారం తగ్గుతుంది’ కొత్త విద్యావిధానంపై ప్రధాని మోదీ

నూతన విద్యా విధానంకు సంబంధించి 30ఏళ్ల తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని మోదీ అన్నారు. నర్సరీ నుంచి పీజీ వరకు విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చాం. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నూతన...

విస్తరణకు వేళాయే.. కేంద్రంలో అమాత్యయోగం ఎవరికో?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు వేళయింది. ఆగస్టు 15వ తేదీలోపే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కసరత్తు పూర్తిచేసి ప్రధాని మోదీకి అందజేసినట్టు...

మోడీ ఆలోచనలు.. పవన్ నాయకత్వం.. అదిరిందయ్యా వీర్రాజూ!

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ తాజా అధ్యక్షుడు సోము వీర్రాజుకి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అంటే వీరాభిమానం. ఇది అందరికీ తెల్సిన విషయమే. ఈ రోజు జనసేన అధినేతను హైద్రాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన సోము...

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ.. మూడు నెలల గడువులో..

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాల సంఖ్యను 25కి పెంచుతామని ఆమధ్య సీఎం జగన్ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇందుకు ప్రభుత్వం...

ఎక్కువ చదివినవి

జస్ట్‌ ఆస్కింగ్‌: బాలయ్యా.. ఎక్కడున్నావయ్యా.?

‘అమరావతి రైతులకు అన్యాయం జరుగుతోంటే చూస్తూ ఊరుకునేది లేదు.. మా కార్యకర్తల్ని వేధిస్తే సహించేది లేదు.. నేను రంగంలోకి దిగేవరకే.. రంగంలోకి దిగానంటే.. దబిడి దిబిడే..’ అన్న తరహాలో అప్పుడప్పుడూ పొలిటికల్‌ స్టేట్‌మెంట్లు...

రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ కన్నుమూత.!

ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజ్యసభ ఎంపీ, మాజీ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్ కన్నుమూశారు. కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీంతో ఆయనకు సింగపూర్...

విస్తరణకు వేళాయే.. కేంద్రంలో అమాత్యయోగం ఎవరికో?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు వేళయింది. ఆగస్టు 15వ తేదీలోపే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కసరత్తు పూర్తిచేసి ప్రధాని మోదీకి అందజేసినట్టు...

హిందుస్థాన్ షిప్ యార్డు మృతులకు 50 లక్షల పరిహారం..

విశాఖలో నిన్న హిందుస్థాన్ షిప్ యార్డులో క్రేన్ కూలిపోయిన దుర్ఘటన చాలా బాధాకరమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ‘హిందుస్థాన్ షిప్ యార్డుకు దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎన్నో షిప్స్...

ఏపీలో అక్టోబర్ 15 నుంచి కాలేజీలు.. ఇకపై అక్కడా నాడు-నేడు: జగన్ నిర్ణయం

కరోనా కారణంగా నిలిచిపోయిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాడిలో పెడుతోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాలేజీలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబర్ 15 నుంచి కాలేజీలు తెరవాలని సీఎం జగన్ నిర్ణయించారు....