Uppena: మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) – కృతిశెట్టి (krithi Shetty) జంటగా బుచ్చిబాబు సనా (Buchibabu sana) దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన (Uppena) సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. వైష్ణవ్-కృతికి కూడా తొలి సినిమానే అయినా తమదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు. సినిమా విజయంతో వీరు పలు ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. అయితే.. సినిమాలో హీరోయిన్ గా అవకాశం ముందు తననే వరించిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రాజశేఖర్-జీవిత కుమార్తె శివాని (Sivani). ప్రస్తుతం ఈ అంశం వైరల్ అయింది.
‘ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ముందుగా నన్నే వరించింది. అయితే.. బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని ఆఫర్ తిరస్కరించాను. కథ వినగానే ఫ్యామిలీతో కలిసి చూడలేనేమో అనే సందేహం వచ్చింది. అందుకే అవకాశం వదులుకున్నాను. అయితే.. నేను విన్న కథకు.. తెర మీద సినిమాకు చాలా మార్పులు జరిగాయ’ని శివాని అన్నారు. తెలుగులో అద్భుతం, డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ, శేఖర్, కోటబొమ్మాళి పీఎస్, మలయాళంలో నాయట్టు సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది శివాని.