యాంగ్రీ యాంగ్ మెన్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా టీజర్ నిన్న మహేష్ బాబు మహర్షి సినిమాతో పాటు విడుదలైంది. ఈ టీజర్ చూసినవాళ్లకు తెగ నచ్చేసిందట. అప్పుడే యూ ట్యూబ్ లో వ్యూస్ పెరిగిపోతున్నాయి. సోసియో ఫాంటసీ థిల్లర్ గా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ ట్రైలర్ లో రాజశేఖర్ వేసిన పంచులు బాగా పేలాయి .. అయితే ఇది పవన్ కళ్యాణ్ కు కౌంటర్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ .. ఏమి చేస్తిరి.. ఏమి చేస్తిరి అంటూ రాజశేఖర్ స్టైల్ లో డైలాగ్స్ చెబుతూ వేసిన డైలాగ్స్ బాగా పేలాయి అప్పట్లో .. అది ట్రెండీగా మరి పలు కామెడీ షోస్ లో కూడా రాజశేఖర్ ని ఇమిటేట్ చేస్తూ చాలా మంది కమెడియన్స్ కూడా ఈ డైలాగ్స్ చెబుతూ కామెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ కూడా తనకు తానే డైలాగ్స్ వేసుకుని .. ఏమి చెబితిరి .. ఏమి చెబితిరి అంటూ తనకు తానే డైలాగ్స్ చెప్పుకుని పంచ్ వేసుకున్నాడు.
ఈ డైలాగ్స్ తో ఈ సినిమాలో కామెడీ కూడా ఓ రేంజ్ లో ఉంటుందన్న విషయం అర్థం అవుతుంది. దానికి తోడు రాజశేఖర్ ( డూప్ ) ఉండే నటుడు వేసిన స్టెప్పుకూడా ఇమిటేట్ చేసి మరో పంచ్ వేసాడు. మొత్తానికి రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనే తరహాలో కల్కి టీజర్ ఉందంటూ టాక్ స్ప్రెడ్ అయింది. మరి ఈ సినిమాతో రాజశేఖర్ తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటాడా లేదా అన్నది చూడాలి. రాజశేఖర్ సరసన నందిత శ్వేతా, ఆదా శర్మ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు రాజశేఖర్.